Supreme Court: కారుణ్య నియామకాలకు వాళ్లు కూడా అర్హులే.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

పెళ్లైన తర్వాత కూడా తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న కూతుళ్లకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి స్థానంలో ఇచ్చే కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Supreme Court: కారుణ్య నియామకాలకు వాళ్లు కూడా అర్హులే.. సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు
Supreme Court Verdict On Compassionate Appointment

Updated on: Jun 02, 2026 | 1:26 PM

తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి స్థానంలో ఇచ్చే కారుణ్య నియామకాలకు పెళ్లి చేసుకున్న కూతుళ్లు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది. పెళ్లయింది అయింది అనే ఒక్క కారణంతో మహిళల హక్కులను కాలరాయలేరని కోర్లు చెప్పుకొచ్చుంది. వివాహం అనేది ఒక మహిళ అర్హతను లేదా ఆమె తన తల్లిదండ్రులపై ఆధారపడే స్థితిని మార్చలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

కారుణ్య నియామకాల్లో కుమారులతో పాటు పెళ్లైన కుమార్తెలకు కూడా సమానమైన అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ నియమావళిలో కేవలం వివాహం కాని కుమార్తెలు మాత్రమే అర్హులని ఉంచడం రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టు పేర్కొంది. సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరాకరించడానికి పెళ్లి కారణం కారాదని.. ఎవరైనా తల్లిదండ్రులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి ఉద్యోగాన్ని ఆశ్రిత కుమార్తెకు కూడా ఇవ్వొచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే తింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా సర్వొన్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న పెళ్లైన కుమార్తెలకు పెద్ద ఊరటనిస్తుంది. ఇక సుప్రీం తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ కారుణ్య నియామక నిబంధనల్లో మార్పులు చేసి, అవివాహిత అనే పదాన్ని తొలగించి, పెళ్లైన కూతుళ్లకు కూడా లబ్ధిదారులుగా చేర్చాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us