Sara Tendulkar: ‘తండ్రి డబ్బును వేస్ట్ చేస్తున్నావ్’ అన్న నెటిజన్‌కు.. సారా టెండూల్కర్ సాలిడ్ కౌంటర్

|

Apr 17, 2021 | 12:18 PM

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను...

Sara Tendulkar: తండ్రి డబ్బును వేస్ట్ చేస్తున్నావ్ అన్న నెటిజన్‌కు.. సారా టెండూల్కర్ సాలిడ్ కౌంటర్
Sara Tendulkar
Follow us on

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై… ఒక మహిళా ఫాలోవర్ ఘాటు కామెంట్ పెట్టగా.. సారా అదే రేంజ్‌లో రిప్లై ఇచ్చింది.

సారా టెండూల్కర్ ఏప్రిల్ 16 న కారులో కాఫీ తాగుతున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘బ్లూ టోకై కాఫీ ప్రాణాలను కాపాడుతుంది’.. అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. సహజంగానే, ఆమె పెట్టిన ప్రతి ఫోటోకు భారీ స్థాయిలో లైక్స్, షేర్స్, కామెంట్స్ వస్తాయ్. కానీ ఓ మహిళా ఫాలోవర్ మాత్రం ఆమెను ట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. సారా తన తండ్రి డబ్బును వృథా చేస్తున్నట్లు సదరు మహిళా ఫాలోవర్ కామెంట్ పెట్టారు. దీంతో సారా సీరియస్ అయ్యింది. ఆమె చేసిన కామెంట్‌ను స్క్రీన్ షాట్‌ తీసి.. స్పెషల్ కౌంటర్ ఇచ్చింది. “కెఫిన్ కోసం ఖర్చు చేసిన డబ్బు వృథా కాదు, ఇది సరైన పనే” అని పేర్కొంది.

Sara Post

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే మహిళ గతంలో సారా సోదరుడు అర్జున్‌ను కూడా ట్రోల్ చేసింది. ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను రూ .20 లక్షలకు ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. అప్పుడు ‘చౌకైన అబ్బాయి’ అంటూ అర్జున్‌ను ఉద్దేశిస్తూ కామెంట్ పెట్టింది.

భారత మాజీ క్రికెట్ లెజెండ్, భారత్ రత్న సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా అన్న విషయం తెలిసిందే. ముంబైలో జన్మించిన సారా… లండన్ యూనివర్శిటీ కాలేజీ (యుసిఎల్) నుండి మెడిసిన్ పూర్తి చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ప్రముఖులలో ఒకరైన స్టార్ కిడ్స్ జాబితాలో సారా టెండూల్కర్ పేరు ఉంది.  ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ సహారా కప్ పేరు మీద ‘సారా’  పేరు పెట్టారు. 1997 లో టెండూల్కర్ కెప్టెన్‌గా గెలిచిన మొదటి సిరీస్ ఇది.

Also Read: విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు

ఆ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో తెరుచుకుంటే.. వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటుంది