ఇండియాలో మా కరోనా వైరస్ వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తాం, రష్యా

కరోనా వైరస్ చికిత్స కోసం తాము డెవలప్ చేసిన స్పుత్నిక్ V వ్యాక్సీన్ ని ఇండియాలో ఉత్పత్తి చేస్తామని రష్యా నిపుణుడు కిరిల్ డిమిట్రియెవ్ ప్రకటించారు. దీనికి సంబంధించి భారతీయ రెగ్యులేటర్లతోను, ఉత్పత్తిదారులతోను సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు.

ఇండియాలో మా కరోనా వైరస్ వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తాం, రష్యా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 19, 2020 | 12:00 PM

కరోనా వైరస్ చికిత్స కోసం తాము డెవలప్ చేసిన స్పుత్నిక్ V వ్యాక్సీన్ ని ఇండియాలో ఉత్పత్తి చేస్తామని రష్యా నిపుణుడు కిరిల్ డిమిట్రియెవ్ ప్రకటించారు. దీనికి సంబంధించి భారతీయ రెగ్యులేటర్లతోను, ఉత్పత్తిదారులతోను సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ అయినా కిరిల్.. తమ దేశంలో ఈ వ్యాక్సీన్  ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించారు. స్పుత్నిక్ వ్యాక్సీన్ పట్ల ఇండియా ఎంతో ఆసక్తి చూపిందని, భారత్ తో తమ దేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కోవిడ్ వ్యాక్సీన్ ని పెద్దఎత్తున ఉత్పత్తి చేసే సత్తా ఇండియాకు ఉందని కిరిల్ పేర్కొన్నారు. భారతీయ శాస్త్రజ్ఞులు, ఉత్పత్తిదారులకు మా దేశ టెక్నాలజీ గురించి బాగా తెలుసునని అన్నారు.

ఇండియాలో పేస్ 3 క్లినికల్ ట్రయల్సని ప్రారంభించే యోచన కూడా ఉందని, భారత్, యూఏఈ తో బాటు మొత్తం 20 దేశాలతో తాము టచ్ లో ఉన్నామని కిరిల్ వెల్లడించారు. ప్రపంచంలో తమదే తొలి కరోనా వైరస్ వ్యాక్సీన్ అని రష్యా ప్రకటించుకున్న సంగతి విదితమే.