నడిరోడ్డుపై రివాల్వర్‌తో వీరంగం.. పాత కక్షల కారణంగా కాల్పులకు తెగబడ్డ థియేటర్ యజమాని.. ఇద్దరికి తీవ్ర గాయాలు

|

Nov 16, 2020 | 2:28 PM

తమిళనాడులో ఓ థియేటర్ యజమాని నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. తన దగ్గరున్న రివాల్వర్‌తో తన చిరకాల ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. భూ వివాదం కారణంగా తనపై ఫిర్యాదు చేసిన ప్రత్యర్థులపై కాల్పులకు దిగాడు. ఒకరిద్దరు ప్రతిఘటించడంతో అక్కడ్నించి పరారయ్యాడు.

నడిరోడ్డుపై రివాల్వర్‌తో వీరంగం.. పాత కక్షల కారణంగా కాల్పులకు తెగబడ్డ థియేటర్ యజమాని.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Follow us on

Revolver firing on road in Tamilnadu: తమిళనాడులో ఓ థియేటర్ యజమాని రివాల్వర్‌తో నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. స్థానికంగా వున్న విభేదాల కారణంగా ముగ్గురిపై రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నడి రోడ్డుపై యధేచ్ఛగా కాల్పులు జరపడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఉలిక్కి పడ్డారు. భయాందోళనకు గురయ్యారు.

తమిళనాడు లోని దిండిగల్ జిల్లా పళనిలో థియేటర్ నటరాజన్ రివాల్వర్‌తో విరుచుకుపడ్డాడు. పళనిలో వళ్ళువర్ థియేటర్ యజమాని అయిన నటరాజన్‌కు స్థానికంగా వుండే ఫళనిస్వామితో విభేదాలున్నాయి. భూ వివాదంలో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ క్రమంలో నటరాజన్ సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో రివాల్వర్‌తో పళనిస్వామి, సుబ్రమణిలపై నడిరోడ్డు మీద కాల్పులకు తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు థియేటర్ యజమాని నటరాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ: అభివృద్ధి పనులకు ఎన్నికల కమిషన్ అనుమతి