Watch: బాబోయ్.. సర్కార్ ఆసుపత్రి వార్డులో ఎలుకల స్వైరవిహారం.. రోగుల కంటే అవే ఎక్కువ

|

Jun 12, 2024 | 7:40 PM

ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ యత్రాంగం స్పందించింది. వైద్య కళాశాల డీన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. వీడియోపై తనకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఎలుకల సమస్య నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లు తెలిపారు. వార్డులో చీడపీడల నివారణ చర్యలు చేపట్టామని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ..

Watch: బాబోయ్.. సర్కార్ ఆసుపత్రి వార్డులో ఎలుకల స్వైరవిహారం.. రోగుల కంటే అవే ఎక్కువ
Rats In Hospital
Follow us on

ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితికి అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో సర్కార్‌ దవాఖానా వార్డులో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ వీడియో మధ్యప్రదేశ్‌కు చెందినదిగా తెలిసింది. గ్వాలియర్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ వార్డులో ఎలుకలు సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ మంగళవారం తన X హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్‌ చేసింది. ‘మధ్యప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ అధ్వాన్న పరిస్థితిని చూడండి. అంటూ క్యాప్షన్‌లో విమర్శించింది కాంగ్రెస్‌.

గ్వాలియర్‌లోని కమల రాజా ఆసుపత్రిలో రోగుల కంటే ఎక్కువగా ఎలుకలు తిరుగుతున్నాయి. గ్వాలియర్‌లోని కమలా రాజా ఆసుపత్రిలో రోగుల కంటే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలోని ఆరోగ్య సౌకర్యాల స్థితిపై ప్రభుత్వాన్ని విమర్శించింది. రోగులు, నవజాత శిశువులను ఎలుకల నుంచి రక్షించడానికి గట్టి నిఘా కావాలంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగుల దుస్థితికి అద్దం పట్టే ఈ వీడియోపై కాంగ్రెస్‌తో పాటు, పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా వినియోగదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ యత్రాంగం స్పందించింది. వైద్య కళాశాల డీన్‌ ఆర్‌కేఎస్‌ ధాక్డే విలేకరులతో మాట్లాడుతూ.. వీడియోపై తనకు సమాచారం వచ్చిందని చెప్పారు. ఎలుకల సమస్య నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లు తెలిపారు. వార్డులో చీడపీడల నివారణ చర్యలు చేపట్టామని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలని కోరారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..