ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు

ఉత్తరాఖండ్ లో ద్వారహట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు

Edited By:

Updated on: Aug 18, 2020 | 10:30 AM

ఉత్తరాఖండ్ లో ద్వారహట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ నేగి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తన బిడ్డకు నెగియే తండ్రి అని, కావాలంటే డీ ఎన్ ఏ టెస్ట్ చేయించాలని బాధితురాలు కోరింది. 2016-18 మధ్య నేగి తనపై అత్యాచారాలకు దిగాడని, ఇక అతని భార్య తనకు పాతిక లక్షలిస్తానని, నోరు మూసుకోమని బెదిరిస్తోందని కూడా ఆమె ఆరోపిస్తోంది. అయితే నేగి భార్య..ఈమె తన భర్తను బ్లాక్ మెయిల్ చేస్తోందని అంటూ పోలీసులకు తానూ ఫిర్యాదు చేసింది. ఇంత జరుగుతున్నా  ఎమ్మెల్యే గారు మాత్రం మౌనంగా ఉన్నారు. కామెంట్ చేయడానికి నిరాకరించారు. రెండు ఫిర్యాదులూ స్వీకరించిన పోలీసులు ఈ రేప్ కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us