Rahul Gandhi: దటీజ్ రాహుల్.. 22 మంది చిన్నారులను దత్తత తీసుకోనున్న కాంగ్రెస్ అగ్రనేత

ఆపరేషన్ సిందూర్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పూంఛ్ చిన్నారుల బాధ్యతలను రాహుల్ గాంధీ భుజాన వేసుకున్నారు. సరిహద్దు ఘర్షణల్లో ప్రభావితమైన 22 మంది పిల్లలను దత్తత తీసుకుంటూ, వారి చదువు, వైద్యం, జీవనోపాధి ఖర్చులన్నీ రాహుల్ భరించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి...

Rahul Gandhi: దటీజ్ రాహుల్..  22 మంది చిన్నారులను దత్తత తీసుకోనున్న కాంగ్రెస్ అగ్రనేత
Rahul Gandhi

Updated on: Jul 29, 2025 | 7:04 PM

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల విషయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గొప్ప మనసు చాటుకున్నారు. ఈ సంఘటనలో ప్రభావితమైన 22 మంది చిన్నారులను రాహుల్ దత్తత తీసుకోనున్నారు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ అధికారికంగా వెల్లడించారు. రాహుల్ గాంధీ వారు పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే వరకు వారి విద్య, వైద్యం, జీవనోపాధి ఖర్చులను భరించనున్నారని తెలిపారు.

ఇటీవల సరిహద్దు గ్రామాల్లో పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ పూంఛ్‌లోని క్రైస్ట్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులను కలుసుకుని వారి పరిస్థితి తెలుసుకుని.. చలించిపోయారు. వెంటనే సహాయం అందించేందుకు లిస్ట్ తయారు చేయాలని రాష్ట్ర పార్టీ నేతలకు ఆదేశించారని హమీద్ చెప్పారు.

ఇప్పటికే 22 మంది పిల్లల జాబితా సిద్ధమైందనీ, త్వరలోనే తొలివిడత సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా బలమైన బదులు ఇచ్చాయి. ఆ అనంతరం పాకిస్తాన్ ప్రతిస్పందనగా సరిహద్దు గ్రామాలపై దాడులకు పాల్పడింది. పూంఛ్ ప్రాంత ప్రజలు ఈ దాడుల్లో అత్యధికంగా ప్రభావితమయ్యారు. 25 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి