Rahul Gandhi sensational tweet: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ చేసిన ట్విట్ సంచలనంగా మారింది. నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే ఎందుకు మొదలవుతున్నాయంటూ.. రాహుల్ ప్రధానమంత్రి మోదీ పేరును పరోక్షంగా తీసుకుంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నియంతల పేర్లన్నీ ‘ఎం’ అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతున్నాయి.. మార్కస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో’’ అంటూ.. రాహుల్ వారి పేర్లను ఉదహరించారు. ఈ ట్వీట్‌ను నెట్టింట సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఈ ట్విట్‌తో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. ప్రధాని మోదీ పేరు ‘ఎం’ తో మొదలవుతుందంటూ ఒకరు విమర్శిస్తుంటే.. యూపీఏ హయాంలోని ప్రధాని మన్‌మోహన్ పేరు కూడా ఆ అక్షరంతోనే మొదలవుతుంది అంటూ.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Why do so many dictators have names that begin with M ?
Marcos
Mussolini
Milošević
Mubarak
Mobutu
Musharraf
Micombero— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2021
Also Read:
రాజ్యసభలో ఎంపీలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీరియస్.. ఫోన్లు వాడొద్దంటూ ఆగ్రహం..