మహారాష్ట్రలోని పుణెలో ఉన్న హై స్పిరిట్స్ పబ్ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గెస్టులకు.. ఇన్విటేషన్‌తోపాటు కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ను పంపించింది. ఈ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్ మేనేజ్మెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.
పబ్, నైట్ లైఫ్‌కు తాము వ్యతిరేకం కాదని యూత్ కాంగ్రెస్ నేత అక్షయ్ తెలిపారు. అయితే యూత్‌ను తమ పబ్‌కు వచ్చేలా ఇలాంటి దిగజారుడు పనులు, చెత్త మార్కెటింగ్ వ్యూహాలు సరికావని మండిపడ్డారు. సదరు పబ్‌పై వెంటనే పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇన్విటేషన్ కార్డును అందుకున్న పలువురిని పిలిచి విచారించినట్లు చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..