
యూపీలోని సొంభద్రలో కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్ట్‌పై సోదరుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అక్రమ అరెస్టని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ రైతులను కలిసేందుకు వెళ్లిన ప్రియాంకను.. అధికార అండతో అరెస్ట్ చేశారని ట్విట్టర్ ద్వారా ఖండించారు. అధికారం అండతో ఏకపక్షంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారని.. తమ సొంత భూమి కోసం పోరాడుతున్న రైతులను తుపాకులతో కాల్చి చంపారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో భద్రతను బీజేపీ గాలికొదిలేసిందంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ సహా కొంతమంది కాంగ్రెస్ నేతలు స్థానిక పోలీసులతో మాట్లాడుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు.
సోంభద్ర సమీపంలోని ఓ గ్రామంలో 22 ఎకరాల భూవివాదంలో ఇరు గ్రూపులు ఒకరినొకరు కాల్చుకున్నారు. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డరు.