PM Modi: అద్వానికి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్.. రాజకీయ దురంధరుడు అంటూ ప్రశంసలు

|

Nov 08, 2024 | 8:48 PM

బీజేపీ సీనియర్ నేత, దేశ మాజీ హోం మంత్రి ఎల్.కే అద్వానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. తన ఇంటికి వెళ్లి అద్వానిని ఆప్యాయంగా పలకరించారు ప్రధానమంత్రి. దేశానికి విశేష సేవలకు అందించినందుకు గానూ..

PM Modi: అద్వానికి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్.. రాజకీయ దురంధరుడు అంటూ ప్రశంసలు
Pm Modi And Lk Advani
Follow us on

బీజేపీ సీనియర్ నేత, దేశ మాజీ హోం మంత్రి ఎల్.కే అద్వానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. తన ఇంటికి వెళ్లి అద్వానిని ఆప్యాయంగా పలకరించారు ప్రధానమంత్రి. దేశానికి విశేష సేవలకు అందించినందుకు గానూ భారతరత్న పురస్కారం అందుకున్న అద్వానికి ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అద్వాని.. ఎప్పుడూ కూడా ఆయన తెలివితేటలు, సలహాలకు గౌరవం పొందుతూనే ఉంటారని.. కొన్నేళ్ల పాటు ఆయన తనకు మార్గదర్శకుడిగా ఉండటం తన అదృష్టమని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

బీజేపీలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన ఎల్‌కే అద్వానీ.. 2002-04 మధ్య అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందుకున్నారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిచ్చిన అద్వాని.. పలు సంస్కరణలను తీసుకొచ్చారు. ఇక అద్వాని తనపై చూపించిన ఆప్యాయతకు.. ఆయన మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షుతో జీవించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు 1942లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అద్వాని. దేశంలోనే బలమైన రాజకీయ పార్టీగా బీజేపీని తీర్చిదిద్దడంలో అద్వాని కృషి కూడా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1986-1990, 1993-1998, 2004-2005 మధ్య మూడు పర్యాయాలు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో పార్టీ స్థాపించినప్పటి నుంచి అత్యధిక కాలం అధ్యక్షుడిగా పని చేసిన నేతగా రికార్డుల్లోకి ఎక్కారు. బీజేపీ ఎదుగుదలలో కీలక వ్యక్తైన అద్వాని 1999 నుంచి 2004 వరకు దేశ హోంమంత్రిగా, వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం 1998లో దేశంలో అణు పరీక్షలు, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా ముఖ్యమైన రాజకీయ పరిణామాలు, సంస్కరణలు చోటు చేసుకున్నాయి.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..