
చెన్నై, అక్టోబర్ 11: నగర ప్రజల చిరకాల స్వప్నమైన చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 నెట్‌వర్క్‌లోని తొలి మార్గాన్ని అధికారికంగా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రజల ప్రయాణ సమయాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో పూనమల్లి నుంచి వడపళని వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర సీఎం విజయ్‌తో కలిసి అధికారికంగా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి పూనమల్లి నుంచి పోరూర్ బైపాస్ వరకు మెట్రోలో ప్రయాణించారు. అలాగే మెట్రోలో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ప్రధాని మోదీ, విజయ్ ఆత్మీయంగా మాట్లాడారు.
ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఐఐటీ మద్రాస్‌లో జరిగే కార్యక్రమంలో పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత, సాయంత్రం 4 గంటల నుంచి సామాన్య ప్రయాణికులకు ఈ మార్గంలో సేవలు అందుబాటులోకి వస్తాయి.
వీడియో చూడండి..
EXCLUSIVE:
More visuals of PM Modi and CM Vijay travelling together on the Chennai Metro Phase 2 train. https://t.co/aaPpKfjSGi
— Actor Vijay Team (@ActorVijayTeam) October 11, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.