SEMICON India 2026: సెమీకండక్టర్ రంగంలో సరికొత్త శకం..సెమికాన్ ఇండియా 2026 ను ప్రారంభించనున్న మోదీ

భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఢిల్లీ ద్వారకలోని యశోభూమి వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ చిప్ తయారీ దిగ్గజాలు, విధాన రూపకర్తలు, నిపుణులు, పెట్టుబడిదారులు భారీగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది సదస్సును సిలికాన్ నుంచి సిస్టమ్ వరకు పూర్తి ఎకోసిస్టమ్ నిర్మాణం అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

SEMICON India 2026: సెమీకండక్టర్ రంగంలో సరికొత్త శకం..సెమికాన్ ఇండియా 2026 ను ప్రారంభించనున్న మోదీ
Pm Modi To Inaugurate Semicon India 2026

Updated on: Sep 15, 2026 | 12:13 PM

గత దశాబ్ద కాలంలో భారత్ సాధించిన ఎలక్ట్రానిక్స్ తయారీ పురోగతి ఇప్పుడు సెమీకండక్టర్ల రంగానికి బలమైన పునాదిగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే 2014-15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, 2025-26 నాటికి రూ. 13.11 లక్షల కోట్లకు చేరాయి అంటే దశాబ్ధ కాలంలో ఈ రంగంలో సుమారు ఏడు రెట్లు వృద్ధి సాధించాం.

రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా భారత్‌!

అలాగే మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలోనూ భారత్‌ దూసుకుపోతుంది. పదేళ్లక్రితం రూ. 18,000 కోట్లగా ఉన్న ఉత్పత్తులు ఇప్పడు 6.27 లక్షల కోట్లకు చేరాయి. అంటే మొబైల్ తయారీలో 33 రెట్లు వృద్దిని సాధించారు. అలాగే ఎగుమతులు రేఊ.1,500 కోట్ల నుంచి ఏకంగా రూ.2.59 లక్షల కోట్లకు చేరాము అంటే దాదాపు 165 రెట్లు పెరుగుదల అని చెప్పవచ్చు. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా వాడుతున్న మొబైల్స్‌లో 99.2 శాతం ఫోన్‌లు స్థానికంగా తయారవుతున్నవే కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు భారత్‌ భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఎదిగింది.

సెమికాన్ 1.0 నుంచి 2.0 వరకు

ఈ రంగం ప్రారంభంలో సెమికాన్ 1.0 కి ప్రభుత్వం రూ. 76,000 కోట్లు కేటాయించగా, జూలై 2026లో ఆమోదం పొందిన సెమికాన్ 2.0 కు మరో రూ.1.27 లక్షల కోట్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇందులో ఆరు రాష్ట్రాల్లో రూ.1.64 లక్షల కోట్లకు పైగా విలువైన 12 ప్రాజెక్టులు ఇప్పటికే ఆమోదం పొందగా.. ఇందులో ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు, అధునాతన ప్యాకేజింగ్ , డిస్‌ప్లే యూనిట్లు ఉన్నాయి. వీటిలో మూడు ప్లాంట్లలో ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తులు కూడా మొదలయ్యాయి.

దేశవ్యాప్తంగా చిప్ డిజైనింగ్ విప్లవం

ప్రస్తుతం ఈ దశాబ్దంలో 85,000 మంది నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను తయారు చేయడమే లక్ష్యంగా చిప్స్ టు స్టార్టప్ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. C-DAC ఆధ్వర్యంలోని ChipIN సెంటర్ ద్వారా 500కి పైగా విద్యా సంస్థలు, స్టార్టప్‌లకు చెందిన లక్ష మందికి పైగా ఇంజనీర్లకు అత్యాధునిక డిజైన్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్ 2026 నాటికి 75 సంస్థలు 211 చిప్ డిజైన్లను టేప్-అవుట్ దశకు చేర్చగా, అందులో 7 అధునాతన 12nm వరకు చిప్స్ విజయవంతంగా తయారయ్యాయి.

అంతర్జాతీయ సహకారం – పాక్స్ సిలికా

గ్లోబల్ సెమీకండక్టర్ సప్లై చైన్‌ను సురక్షితం చేసేందుకు అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ కూటమి Pax Silicaలో ఇటీవలే భారత్ అధికారికంగా చేరింది. దీని వల్ల కీలక ఖనిజాలు, ఆధునిక ఏఐ సిస్టమ్స్, సరఫరా గొలుసులపై ఏ ఒక్క దేశపు గుత్తాధిపత్యం లేకుండా ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యాన్ని భారత్ ప్రోత్సహిస్తోంది.

యశోభూమిలో భారీ ఏర్పాట్లు

ఇక ప్రస్తుతం యశోభూమిలో 15,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 విదేశీ కంపెనీలు, 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట్రాల పెవిలియన్లు కొలువుదీరాయి. స్టార్టప్‌లు, విద్యార్థుల హ్యాకథాన్‌లు, మహిళా పారిశ్రామికవేత్తల ఫోరమ్‌లతో ఈ వేదిక ప్రపంచ సెమీకండక్టర్ చిత్రపటంలో భారత్ ముద్రను చాటిచెప్పనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us