PM Modi: ‘మన్ కీ బాత్’లో అరకు కాఫీ, కేరళ గొడుగుల ప్రస్తావన.. వికసిత్ భారత్ లక్ష్యంః మోదీ

మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ 'మన్‌ కీ బాత్‌'లో మాట్లాడారు. మోదీ 3.Oలో ఇది తొలి మన్‌ కీ బాత్‌. పలు కీలక అంశాల్ని ప్రధాని మోదీ ఇందులో ప్రస్తావించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఆయన ఈ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

PM Modi: 'మన్ కీ బాత్'లో అరకు కాఫీ, కేరళ గొడుగుల ప్రస్తావన.. వికసిత్ భారత్ లక్ష్యంః మోదీ
Pm Modi Maan Ki Baat
Follow us

|

Updated on: Jun 30, 2024 | 12:22 PM

మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో మాట్లాడారు. మోదీ 3.Oలో ఇది తొలి మన్‌ కీ బాత్‌. పలు కీలక అంశాల్ని ప్రధాని మోదీ ఇందులో ప్రస్తావించారు. మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమం కొన్ని రోజులు ఆగింది కానీ.. మన్‌ కీ బాత్‌ స్ఫూర్తి దేశంలో వికసిస్తూనే ఉందన్నారు ప్రధాని మోదీ. దాదాపు నాలుగు నెలల తర్వాత ఆయన ఈ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రోగ్రామ్‌లో ఇది 111వ ఎపిసోడ్. అంతకుముందు ఫిబ్రవరిలో 110వ ‘మన్ కీ బాత్’ ప్రోగ్రామ్ చేశారు ప్రధాని మోదీ.

‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన్ కీ బాత్ కు సంబంధించి మూడు నెలల్లో లక్షల్లో సందేశాలు వచ్చాయన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా వస్తానని, మా ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారు. అందుకే మీ అందరి మధ్య ఉన్నానని, వికసిత్‌ భారత్‌ కోసం కృషి చేస్తున్నామన్నారు.

మన్ కీ బాత్ ప్రోగ్రామ్‌లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఇవే!

ఆంధ్రా ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని మోదీ దేశ ప్రజలకు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు చెందిన ఎన్నో ఉత్పత్తులకు డిమాండ్‌ ఉందని, భారత్‌కు చెందిన ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తం కావడం చూసినప్పుడు గర్వంతో నిండిపోయనన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని అల్లూరి సీతా రామరాజు జిల్లాలో అరకు కాఫీని అధిక మొత్తంలో పండిస్తారు. ఇది గొప్ప రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందిందని మోదీ కొనియాడారు. స్థానిక ఉత్పత్తులకు ప్రజాదరణ పొందాలన్నారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో లోక్‌సభ ఎన్నికలపై మాట్లాడారు. మన రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమకున్న అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు అన్న ప్రధాని.. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత పెద్ద ఎన్నికలు జరగలేదని, అందులో 65 కోట్ల మంది ఓట్లు వేశారు. దీని కోసం కృషీ చేసిన ఎన్నికల కమిషన్‌తోపాు ఓటింగ్ ప్రక్రియతో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు.

టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. తమదైన స్టైల్లో ట్రోఫీని మరోసారి ఇంటికి తీసుకొచ్చారు. భారత జట్టును చూసిన నేను గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే టోక్యో ఒలింపిక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుందని మోదీ అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌ నుంచి మన ఆటగాళ్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారన్నారు. ఆటగాళ్లందరినీ కలుపుకుంటే, దాదాపు 900 అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నారు.

‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రత్యేక రకమైన గొడుగుల గురించి ప్రస్తావించారు. ఈ గొడుగులు మన కేరళలో తయారవుతున్నాయని తెలిపారు. కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. అక్కడ అనేక సంప్రదాయాలు, ఆచారాలలో గొడుగులు ఒక ముఖ్యమైన భాగం. ‘కర్తుంబి గొడుగులు’ కేరళలోని అట్టప్పాడిలో తయారు చేయడం జరగుతోంది. గొడుగులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ గొడుగులను గిరిజన సోదరీమణులు తయారుచేస్తారు. ఈ గొడుగులకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తున్నారని మోదీ వెల్లడించారు.

జూన్ 30 చాలా ముఖ్యమైన రోజు అని ప్రధాని మోదీ అన్నారు. మన గిరిజన సోదరులు, సోదరీమణులు ఈ రోజును ‘హల్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజు విదేశీ పాలకుల దురాగతాలను తీవ్రంగా వ్యతిరేకించిన వీరుడు సిద్ధో-కన్హు అద్భుతమైన ధైర్యంతో ముడిపడి ఉందన్నారు. వేలాది మంది సంతాలీ సహచరులను ఏకం చేశారని, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. 1857లో భారతదేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి రెండేళ్ళ ముందు అంటే 1855లో జరిగింది.జార్ఖండ్‌లోని సంతాల్ పరగణాలో మన గిరిజనులు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టినట్లు మోదీ గుర్తు చేశారు.

రేడియో కార్యక్రమంలో పర్యావరణం, మొక్కలు నాటడంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం ఏది అంటే పర్యావరణం అన్నారు . పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ తల్లి కోసం మొక్కలు నాటుతున్నారని, ఉద్యోగం చేసే మహిళ అయినా, గృహిణి అయినా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతున్నారని ప్రధాని అన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రచారం ప్రారంభించడం జరిగిందన్న మోదీ, ఈ ప్రచారం పేరు – ఏక్ పీడ్ మా కే నామ్ అన్నారు. ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ తన తల్లిని గుర్తు చేసుకున్నారు. తల్లి పేరిట ఒక చెట్టును తప్పనిసరిగా నాటాలని ప్రధాని మోదీ అన్నారు. మా అమ్మ పేరు మీద కూడా ఓ చెట్టు నాటాను. మనందరి జీవితంలో తల్లికి అత్యున్నత స్థానం ఉంది. భూమి తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆమె కూడా మమ్మల్ని మా అమ్మలాగే చూసుకుంటుందని హితవు పలికారు.

ఈ ఏడాది మే నెలలో తుర్క్‌మెనిస్థాన్‌లో జాతీయ కవి 300వ జయంతి వేడుకలు నిర్వహించామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని 24 మంది ప్రముఖ కవుల విగ్రహాలను తుర్క్ మెనిస్థాన్ అధ్యక్షుడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాలలో ఒకటి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉందని గుర్తు చేశారు. ఇది గురుదేవ్ పట్ల గౌరవం, భారతదేశం పట్ల గౌరవం అన్నారు. జూన్ నెలలో రెండు కరేబియన్ దేశాలు సురినామ్ సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ తమ భారతీయ వారసత్వాన్ని ఉత్సాహంతో జరుపుకున్నారని ఆయన అన్నారు. సురినామ్‌లోని భారతీయ సంతతి ప్రతి సంవత్సరం జూన్ 5ని ఇండియన్ అరైవల్ డే, ఓవర్సీస్ డేగా జరుపుకుంటుందన్నారు.

ఇటీవల జరుపుకున్న యోగా దినోత్సవం ప్రాముఖ్యత గురించి ప్రధాన మంత్రి మరోసారి ప్రస్తావించారు. ఇది జీవితానికి ఎంత ముఖ్యమైనదో చెప్పారు. ఈ నెల 10వ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఉత్సాహంగా, ఉత్సాహంగా జరుపుకుందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నానని, కశ్మీర్‌లో యువతతో పాటు అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు కూడా యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.

ఈరోజు జూన్ 30న ఆల్ ఇండియా రేడియో సంస్కృత బులెటిన్ ప్రసారమై 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ బులెటిన్ చాలా మందిని 50 సంవత్సరాలుగా సంస్కృతంతో నిరంతరం కనెక్ట్ చేసింది. ఆల్ ఇండియా రేడియో కుటుంబాన్ని అభినందించారు మోదీ. బెంగళూరు-కబ్బన్ పార్క్ ఉందని చెప్పారు. ఇక్కడి ప్రజలు ఈ పార్కులో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ వారానికి ఒకసారి, ప్రతి ఆదివారం, పిల్లలు, యువకులు, పెద్దలు తమలో తాము సంస్కృతంలో మాట్లాడుకుంటారని ప్రధాని మోదీ తెలిపారు.

ఇదొక్కటే కాదు, ఇక్కడ సంస్కృతంలోనే అనేక డిబేట్ సెషన్స్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిని సమష్టి గుబ్బి జీ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ ప్రయత్నం బెంగుళూరు ప్రజలలో చాలా త్వరగా ప్రాచుర్యం పొందింది. మనమందరం అలాంటి ప్రయత్నంలో పాలుపంచుకుంటే, ప్రపంచంలోని అటువంటి పురాతన, శాస్త్రీయ భాష నుండి మనం చాలా నేర్చుకోవచ్చని ప్రధాని మోదీ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే.
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా 5 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే.
తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చోరవతో కలెక్టర్ ఆదేశాలు..
తెలంగాణలో ఆ జిల్లా పేరు మార్పు.. మంత్రి చోరవతో కలెక్టర్ ఆదేశాలు..
అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. ఫ్యూజులు ఔట్
ఇదేం వింత కోరిక తల్లి.! భర్త ముందే ప్రియుడితో అలా.. ఫ్యూజులు ఔట్
17 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతి
17 ఏళ్ల బ్యాడ్మింటన్ ప్లేయర్‌.. గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతి
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే
హోటల్ రూమ్‌లో వైట్ బెడ్‌షీట్స్, టవల్స్ కనిపిస్తాయి ఎందుకో తెలుసా
హోటల్ రూమ్‌లో వైట్ బెడ్‌షీట్స్, టవల్స్ కనిపిస్తాయి ఎందుకో తెలుసా
మైకంలో చెలరేగిపోతున్న పోకిరీలు.. సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్
మైకంలో చెలరేగిపోతున్న పోకిరీలు.. సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్
ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ మధ్య త్రివిక్రమ్.. గురూజీ అడుగులెటు.?
ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ మధ్య త్రివిక్రమ్.. గురూజీ అడుగులెటు.?
గారెలు, వడలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండేందుకు చిట్కాలు
గారెలు, వడలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండేందుకు చిట్కాలు
అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
అప్పుడే OTTలోకి వస్తున్న 100 కోట్లసూపర్ హిట్ మూవీ..
ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ మధ్య త్రివిక్రమ్.. గురూజీ అడుగులెటు.?
ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ మధ్య త్రివిక్రమ్.. గురూజీ అడుగులెటు.?
స్నేహం కోసం.. విజయ్‌ దేవరకొండ తీరుకు ఫిదా అవుతున్న జనం.
స్నేహం కోసం.. విజయ్‌ దేవరకొండ తీరుకు ఫిదా అవుతున్న జనం.
అడ్డంగా దొరికిన హర్ష సాయి.! ఇప్పుడు నీళ్లు నమిలి ఏం లాభం.?
అడ్డంగా దొరికిన హర్ష సాయి.! ఇప్పుడు నీళ్లు నమిలి ఏం లాభం.?
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
7 నిమిషాల క్యారెక్టర్‌కు.. ఏకంగా అన్ని కోట్ల రెమ్యునరేషనా.?
రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..
రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్..
కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..
కల్కి సినిమాకు బన్నీ సూపర్ రివ్యూ.! అదిరిపోయిన విజువల్ వండర్..
ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు ఆసుపత్రి పాలైన తండ్రి.!
ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు ఆసుపత్రి పాలైన తండ్రి.!
రూ.555 కోట్లు కొల్లగొట్టిన కల్కి | రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు
రూ.555 కోట్లు కొల్లగొట్టిన కల్కి | రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..