ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి..
TV9 Telugu
02 July 2024
అల్లరి నరేష్ హీరోగా సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు తెరకెక్కిస్తున్న సినిమా మాస్ ఎంటర్టైనర్ బచ్చల మల్లి.
ఈ చిత్రాన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు సుబ్బు. ఇప్పటికే విడుదలైన ఓ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్.
తాజాగా ఆదివారం అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యారు నరేష్. యూట్యూబ్ లో విదులైన ఈ గ్లింప్స్ అంతా చాలా ఆసక్తికరంగా సాగింది.
ఈ గ్లింప్స్ లో ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమా హనుమాన్ ఫేమ్ అమృత అయ్యారు కథానాయకిగా నటిస్తుంది. రావు రమేష్, హరి తేజ, ప్రవీణ్ కీలక పాత్రధారులు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇది అల్లరి నరేష్ 62వ చిత్రం. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి