విద్యార్దులను అభినందించిన విజయ్..
TV9 Telugu
02 July 2024
ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్దులను అభినందించారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.
అందరికంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థికి డైమండ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు హీరో విజయ్ దళపతి.
గతంలో చాలాసార్లు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం నిర్వహించిన విజయ్, తొలిసారి తన పార్టీ పేరు మీద నిర్వహించారు.
కొన్నిరోజుల క్రితం ఈ కోలీవుడ్ స్టార్ హీరో తమిళగ వెట్రి కళగం అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.
తమిళనాడు ప్రభుత్వ విధానాల నచ్చక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీని స్తాపించినట్టు గతంలో తెలిపారు.
ప్రస్తుతం ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.
దీంతో పాటు తెలుగులో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దలపతి. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
2023లో పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా అంతగా అలరించలేకపోయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి