గోపీచంద్ మలినేని బాలీవుడ్ ఎంట్రీ..
TV9 Telugu
02 July 2024
వీరసింహారెడ్డి తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న గోపీచంద్ మలినేని.. ఈ మధ్యే సన్నీ డియోల్ సినిమాను ప్రకటించారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
దీనికి జట్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంతోనే గోపీచంద్ మలినేని బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.
ఈ సినిమాకి ముందు రవితేజతో కలిసి ఓ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ పూజ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు.
అయితే రవితేజతో ముందు చేసిన మూడు చిత్రాలు హిట్స్ గా నిలిచాయి. దీంతో సినిమాపై భారీ అంచనాల ఏర్పడ్డాయి.
కాగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా ఆదిలోనే ఆగిపోవడంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు.
ఈ మూవీ భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతలు ఎవ్వరు ముందుకు రాలేదు. పెద్ద నిర్మాతలు పాన్ ఇండియాతో బిజీ అయిపోయారు.
దీంతో ఈ సినిమా ఆగిపోయింది. చుడాలిక ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కుతుందో లేక అలాగే మిగిలిపోతుందో. మొదలు కావాలనే ఫ్యాన్స్ ఆశ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి