స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో దేశంలోని పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోడీ కలిసి వారిని సత్కరించారు. భారత పురుషుల హాకీ జట్టు, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, సరబ్జోత్ సింగ్, అమన్ సెహ్రావత్‌లను మోదీ ప్రశంసించారు. దేశానికి అవార్డులు తెచ్చినందుకు వారిని అభినందించారు మోడీ. ఈ సందర్భంగా మోడీ ఒలింపిక్ బృందంతో సమావేశమయ్యారు.
అయితే భారత్ నుంచి పథకాలు సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ముమ్ముందు మరిన్ని పథకాలు సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. కాగా, భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం ఆరు పతకాలను సాధించారు. మను భాకర్, సరబ్జోత్ సింగ్, స్వప్నిల్ కుసాలే, భారత పురుషుల హాకీ జట్టు, నీరజ్ చోప్రాలు గెలిచారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున మా అథ్లెట్లందరినీ అభినందిస్తున్నానని మోడీ అన్నారు. కొత్త కలలు, సంకల్పాలతో ముందుకు సాగుదామని అన్నారు.
VIDEO | PM Modi (@narendramodi) meets Indian Olympic contingent at his residence in Delhi.
(Source: Third Party) pic.twitter.com/K2Gb5dzaCL
— Press Trust of India (@PTI_News) August 15, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి