Pm Modi Controls Tamilnadu : రిమోట్ ద్వారా తమిళనాడును కంట్రోల్ చేస్తున్న మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Feb 28, 2021 | 3:43 PM

తమిళనాడు సీఎం కె.పళనిస్వామి ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ రిమోట్ కంట్రోల్ తో పాలించజూస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు..

Pm Modi Controls Tamilnadu : రిమోట్ ద్వారా తమిళనాడును కంట్రోల్ చేస్తున్న మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్
Follow us on

Pm Modi Controls Tamilnadu: తమిళనాడు సీఎం కె.పళనిస్వామి ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ రిమోట్ కంట్రోల్ తో పాలించజూస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పళనిస్వామి అవినీతిపరుడైనందునే మోదీకి ఎదురుగా నిలబడజాలరని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడజాలరని రాహుల్ అన్నారు. అంతే కాదు.. పళని నిజాయితీపరుడు కాదు. అందుకే తమిళ ప్రజలను తను కంట్రోల్ లో ఉంచగలుగుతున్నానని మోదీ భావిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ అంటే తనకు భయం లేదని, అందుకే రాత్రి వేళ 30 సెకండ్లలో నిద్రించగలుగుతానని, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్ర పోవడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేనని ఆయన సెటైర్ వేశారు. తనను నిజాయితీ పరుడని పళనిస్వామి అనుకుంటున్నారు.. ఈ కారణంగానే మోదీ తనను కంట్రోల్ చేయజాలరని కూడా భావిస్తున్నారని అయన చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ప్రధాని టెలివిజన్ అనుకుంటున్నారు.,నేనేమైనా చేయగలుగుతాను అనుకుంటున్నారు.. ఆయన వాల్యూమ్ పెంచితే ముఖ్యమంత్రి కూడా పెంచుతారు అన్నారాయన.. కానీ తమిళ ప్రజలు ఈ రిమోట్ నుంచి బ్యాటరీ తీసేసి ఆ రిమోట్ ను అవతల పారేస్తారు అన్నారు.

ఇంకా రాహుల్.. తాను అవినీతి పరుడిని కానందునే మోదీ తనను భయపెట్టజాలరని  పేర్కొన్నారు. నేను ఆయన ఎదురుగా నిలబడి సత్యమేమిటో ఆయనకు విడమర్చి చెబుతాను అని కూడా వ్యాఖ్యానించారు. కాగా-ట్యూటికోరన్ జిల్లాలో ఆయన ఉప్పునీటి కయ్యలను విజిట్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉప్పు రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. న్యాయ్ పథకం కింద వీరికి అని విధాలుగా తోడ్పడతామన్నారు.  ఉప్పు రైతుల కష్టాలను  ఎవరూ తెలుసుకోలేకపోతున్నారని, కరోనా వైరస్ అదుపులో ఉప్పు అద్భుతమైన మందుగా ఉపయోగపడుతుందని తనకు తెలిసిందని రాహుల్ అన్నారు. అలాంటిది వీరి బాగోగుల పట్ల ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోవలసి ఉందన్నారు. చైనా అంటే మోదీకి భయమని, అందువల్లే లడాఖ్ లో చైనా ఆక్రమణకు దిగినా ఈ ప్రధాని మాట్లాడడం లేదని ఆయన మళ్ళీ ఆరోపించారు.  తమిళనాడులో ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్న వేళ రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Read More:

ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్​‌లో టాప్ లేపిన రోహిత్ శర్మ.. ఏకంగా 6 స్థానాలు ఎగబాకి.. కెరీర్ బెస్ట్

పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమిదే విజయం.. వంశ రాజకీయాలతో కాంగ్రెస్ పతనం: అమిత్ షా