అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్‌దేశం వేచిచూసిన సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎన్నో శతాబ్ధాల కల నెరవేరింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అయోధ్య గర్భగుడిలో మధ్యామ్నం 12.29 గంటలకు రామ్‌లలాకు ప్రాణ ప్రతిష్ఠ కత్రువు పూర్తి చేశారు. అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం 84 సెకన్ల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగింది. అనంతరం బాల రాముడి పాదాలపై పూలువేసి నమ్రతతో నమస్కరించారు. ఈ వైభవాన్ని దేశ ప్రజలు, రామభక్తులంతా లైవ్‌లో కన్నులారా వీక్షించారు.
అంతకుముందు అయోధ్య ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ..స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పాల్గొన్నారు. జగమంతా సంబరంలా.. భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
రామ్‌లలా ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు.. కర్తలుగా వ్యవహరించారు. ఈ సమయంలో 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు2 గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగించారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మందికి పైగా పాల్గొన్నారు. రామ్‌లలా ప్రాణప్రతిష్ఠ, మందిర ప్రారంభోత్సవానికి చూసేందుకు కూడా వేలాదిమంది అయోధ్యకు తరలి వచ్చారు. దాంతో అయోధ్య నగర వీధులన్నీ రామనామస్మరణతో మార్మోగాయి.
#WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g
— ANI (@ANI) January 22, 2024