PM Modi: నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ జనరల్‌ బోర్డు ఏర్పాటు.. మోడీ అధ్యక్షతన తొలి సమావేశం

కొత్తగా ఏర్పడిన  అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) మొదటి జనరల్ బోర్డ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెప్టెంబరు 10 మంగళవారం  ఢిల్లీలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత ANRF జనరల్ బోర్డ్ మొదటి సమావేశం ఇది. ఈ సమావేశానికి సంబంధించిన..

PM Modi: నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ జనరల్‌ బోర్డు ఏర్పాటు.. మోడీ అధ్యక్షతన తొలి సమావేశం
Follow us

|

Updated on: Sep 10, 2024 | 2:01 PM

కొత్తగా ఏర్పడిన  అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) మొదటి జనరల్ బోర్డ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెప్టెంబరు 10 మంగళవారం  ఢిల్లీలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత ANRF జనరల్ బోర్డ్ మొదటి సమావేశం ఇది. ఈ సమావేశానికి సంబంధించిన దృశ్యాలు విడుదలయ్యాయి. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రధాని మోదీ పలు సూచనలు చేస్తూ కనిపించారు.

రీసెర్చ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) -2023 చట్టం ప్రకారం రీసెర్చ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) స్థాపించారు. దేశంలో పరిశోధన, అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం దీని లక్ష్యం. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, ఆర్అండ్‌బి ప్రయోగశాలలలో పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యం.

దేశంలో శాస్త్రీయ పరిశోధనలకు ఊతం లభిస్తుంది

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) సిఫార్సుల ప్రకారం, దేశంలో శాస్త్రీయ పరిశోధన ఉన్నత-స్థాయి వ్యూహాత్మక దిశను అందించడానికి ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ ఒక అపెక్స్ బాడీగా పని చేస్తుంది. దీని స్థాపనతో 2008లో పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించిన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB), ANRFలో చేర్చారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే శాస్త్రీయ, లైన్ మంత్రిత్వ శాఖలు అలాగే పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భాగస్వామ్యం, సహకారం కోసం ఇంటర్‌ఫేస్ వ్యవస్థను సృష్టిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి