AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR : ఈ కాంబోలో సినిమా వస్తే ఉంటది నా సామిరంగ..! ఫ్యాన్స్‌కు పూనకాలే

ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్  ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. దేవర సినిమాతో పాటు చాలా సినిమాలను ఎన్టీఆర్ లైనప్ చేశారు. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు ఓ క్రేజీ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

NTR : ఈ కాంబోలో సినిమా వస్తే ఉంటది నా సామిరంగ..! ఫ్యాన్స్‌కు పూనకాలే
Ntr
Rajeev Rayala
|

Updated on: Sep 10, 2024 | 1:53 PM

Share

2022లో విడుదలైన RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు అభిమానులు తారక్  తదుపరి చిత్రం ‘దేవరా’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్  ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. దేవర సినిమాతో పాటు చాలా సినిమాలను ఎన్టీఆర్ లైనప్ చేశారు. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు ఓ క్రేజీ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగాతో ఎన్టీఆర్ కలిసి నటించడంపై చర్చలు మొదలయ్యాయి.

రణబీర్ కపూర్ కెరీర్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.917 కోట్లు రాబట్టిన ‘యానిమల్’ సినిమాని అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. షాహిద్ కపూర్‌తో ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా తీశాడు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి. ఇప్పుడు ఎన్టీఆర్, సందీప్ కలసి పని చేయవచ్చని అంటున్నారు. నేడు( సెప్టెంబర్ 10న) దేవర ట్రైలర్ విడుదల కానుంది. ఇందుకోసం ముంబైలో ఓ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ముంబైలోనే ఉన్నాడు. కాగా, ముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిశారు తారక్. వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ తమ సినిమాల గురించి అలాగే రాబోయే చిత్రాల గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం కూడా ఉంది. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు వంగ.  ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది కాకుండా, అతను ‘యానిమల్’  సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. యానిమల్ చిత్రానికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ తీయబోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే
400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే