Ravi Kiran
10 Sep 2024
ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వే ద్వారా ప్రయాణికులు మొదలు, గూడ్స్ వరకు ఎన్నో సేవలను ఇండియన్ రైల్వేస్ అందిస్తున్నాయి.
ఓ ప్యాసింజర్ రైలుకు 24 కోచ్‌లు, గూడ్స్ రైలుకు 50 కంటే ఎక్కువ కోచ్‌లు ఉంటాయి. మరి ప్యాసింజర్, గూడ్స్ రైలుకు అస్సలు ఎందుకని అన్ని కోచ్‌లు ఉంటాయో మీకు తెల్సా.?
ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటిలో ఒక రైలు కచ్చితంగా కొద్దిసేపు మరో ట్రాక్‌పై ఆగాల్సి ఉంటుంది. రైలు వేచి ఉండే ట్రాక్‌ను లూప్ లైన్‌గా పిలుస్తారు. ప్యాసింజర్ రైలు లూప్ లైన్ కంటే పెద్దగా ఉండకూడదు.
ఒకవేళ లూప్ లైన్ దాటి రైలు కోచ్‌లు బయటకు వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్యాసింజర్ రైలులో 24 కంటే ఎక్కువ కోచ్‌లు ఉండవు.
లూప్ లైన్ పొడవు 650 నుంచి 750 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది సరిగ్గా 24 కోచ్‌లకు సరిపోతుంది. రైలులోని అన్ని కోచ్‌లు ప్లాట్ ఫామ్‌పై సులభంగా చేరుకోవడానికి వీలుగా ప్లాట్‌ఫామ్ కంటే రైలు పొడవు ఉండకూడదు.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకులు రవాణా చేస్తుంటాయి గూడ్స్ రైళ్లు. గూడ్స్ రైలుకు ఉండే పెట్టెలు లేదా వ్యాగన్లు పాసింజర్ రైళ్ల బోగీల కంటే చిన్నవిగా ఉంటాయి. అవి 11 నుంచి 15 మీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి.
గూడ్స్ రైళ్లు లూప్ లైన్‌లోకి సరిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అన్ని స్టేషన్లలోనూ ఆగుతాయి. అలాగే గూడ్స్ రైలు ఇంజిన్‌ను ప్రత్యేకంగా భారీ లోడ్లు లాగడానికి వీలుగా రూపొందిస్తారు.
ఒక గూడ్స్ రైలులో 50 కంటే ఎక్కువ కోచ్‌లు అమర్చబడి ఉంటాయి. ఎన్నో ఎక్కువ వ్యాగన్లు గూడ్స్ రైలుకు ఉంటే.. అంత బెటర్.. దాన్ని బట్టే రైల్వేకు మరింత ఆదాయం వస్తుంది.