సమాజంలో చిన్నారులు, బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు(Sexual Harassment) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని నివారించేందుకు ఎన్ని చట్టాలు చేస్తున్నప్పటికీ నిందితుల్లో మార్పు రావడం లేదు. వయసు, లింగ భేదం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు కేరళ(Kerala)లో జరిగిన ఓ ఘటనలో పతనంథిట్ట కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో సంచలన తీర్పు(Justice) ఇచ్చింది. 2016లో ఘటన జరగగా ఇప్పుడు తీర్పు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళలోని తిరుమూలపురం ప్రాంతానికి చెందిన మలయిల్ రోజిన్ టి.రాజు.. 15 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ దగ్గరై ఆమె నుంచి రహస్యంగా ఓ ఫొటోను తీసుకున్నాడు. ఆ ఫొటో ఆధారంగా బాలికను లైంగికంగా వేధించాడు.
అతని వేధింపులు భరించలేక ఈ విషయాన్ని బాలిక పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పింది. దీంతో వారు అప్రమత్తమై.. బాలికపై వేధింపులకు పాల్పడుతున్న రోజిన్ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన 2016లో జరిగింది. అప్పటి నుంచి కోర్టులో ఉన్న ఈ కేసుపై ఎట్టకేలకు ఇప్పుడు తీర్పు వచ్చింది. ఈ మేరకు నిందితుడికి 48 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ.. పతనంథిట్ట ప్రిన్సిపల్ పోక్సో జడ్జి జయకుమార్ జాన్ తీర్పు ఇచ్చారు.
ఇవీచదవండి.
Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని భారతీయులకు కీలక సూచనలు.. ఇండియన్ ఎంబసీ కొత్త గైడ్‌లైన్స్ జారీ
అణ్వాయుధాలు ఏ దేశం దగ్గర ఎక్కువున్నాయో తెలుసా?
Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. అయ్యయ్యో వోడ్కాకు పెద్ద కష్టమే వచ్చి పడిందే