వినూత్న తరహాలో ఆందోళన చేస్తున్న పప్పు యాదవ్

చైనా కంపెనీలపై యుద్ధం ప్రకటిస్తున్నారు పప్పు యాదవ్. తాజాగా గురువారం వినూత్న తరహాలో నిరసనకు దిగారు. ఓ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఎదుట స్థానికులతో కలిసి ఆందోళన చేశారు...

వినూత్న తరహాలో ఆందోళన చేస్తున్న పప్పు యాదవ్
Follow us

|

Updated on: Jun 18, 2020 | 6:25 PM

భారత్- చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్ల వీరమరణంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే “బాయ్‌కాట్ చైనా” పేరుతో అక్కడి ఉత్పత్తులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంతో స్ఫూర్తి పొందినట్లున్నాడో ఏమో… బీహార్‌ రాజధాని పాట్నాలో జన్‌ అధికార్‌ పార్టీ అధినేత పప్పు యాదవ్‌ పెద్ద ఎత్తున ఆందోళనకు తెరలేపుతున్నారు.

చైనా కంపెనీలపై యుద్ధం ప్రకటిస్తున్నారు పప్పు యాదవ్. తాజాగా గురువారం వినూత్న తరహాలో నిరసనకు దిగారు. ఓ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఎదుట స్థానికులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం జేసీబీ ఎక్కిన ఆయన ఆ సంస్థ పేరుపై నల్లరంగు పూసి నిరసన తెలిపారు. చైనా వస్తువులను వాడవద్దని, వాటిని బహిష్కరించాలంటూ నినాదాలు కూడా చేశారు. ఇదంతా చూస్తున్న బీహార్ జనం ఆశ్చర్యపోతున్నారు.