కరోనా భయం.. ఈ నెల 25 వరకు రైళ్లు బంద్ ?

కరోనా మరింత విస్తరించకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా రైళ్లు ఈ నెల 25 వరకు నడవబోవని ఈ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో 8 మంది కరోనా అనుమానితులను కనుగొన్న సంగతి విదితమే.

కరోనా భయం.. ఈ నెల 25 వరకు రైళ్లు బంద్ ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 22, 2020 | 12:10 PM

కరోనా మరింత విస్తరించకుండా చూసేందుకు దేశవ్యాప్తంగా రైళ్లు ఈ నెల 25 వరకు నడవబోవని ఈ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో 8 మంది కరోనా అనుమానితులను కనుగొన్న సంగతి విదితమే. దీంతో కోవిడ్-19 నివారణకు మూడు వేల రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. కాగా-దేశంలో కరోనా కేసులు 324 కి  పెరిగాయి.వీరిలో 22 మంది రోగులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో కరోనా కేసులు 63 కి పెరగగా.. దేశంలో ఈ వ్యాధికి గురై మరణించినవారి సంఖ్య ఐదుకు పెరిగింది. తాజాగా మహారాష్ట్ర (ముంబై)లో ఒక రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఇక పంజాబ్ కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రాష్ట్రంలో అన్ని షాపులు, మాల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కేరళలో కరోనా కేసులు 40 కాగా.. వీరిలో ఏడుగురు విదేశీయులున్నారు. ఢిల్లీలో 27, యూపీలో 24, తెలంగాణాలో 21, ఏపీలో 5 కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 31 వరకు తమ రాష్ట్రంలో ప్రవేశించే అన్ని రైళ్లను నిలిపివేయాలని కోరుతూ  ఝార్ఖండ్ ప్రభుత్వం రైల్వే బోర్డుకు లేఖ రాసింది  గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్, వడోదర నగరాల్లో బుధవారం వరకు లాక్ డౌన్ ప్రకటించారు. గోవా తన సమీప రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. .

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..