New Covid Variant: దేశంలో మరో కొత్త వేరియంట్.. 10 రెట్ల డేంజర్.. పూర్తి వివరాలు!

ఒక వేవ్ ముగిసింది.. ఒక వేరియంట్ ప్రభావం తగ్గింది.. మళ్లీ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందనుకునేలోపు.. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ల..

New Covid Variant: దేశంలో మరో కొత్త వేరియంట్.. 10 రెట్ల డేంజర్.. పూర్తి వివరాలు!
Corona

Updated on: Apr 28, 2022 | 1:35 PM

ఒక వేవ్ ముగిసింది.. ఒక వేరియంట్ ప్రభావం తగ్గింది.. మళ్లీ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందనుకునేలోపు.. కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ల రూపంలో మరోసారి విజృంభిస్తోంది. తాజాగా బీహార్‌లోని పాట్నాలో మరో కొత్త వేరియంట్‌ను పరిశోధకులు కనుగొన్నారు. దానికి బీఏ12(BA12) అని నామకరణం చేశారు. ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(IGIMS) పరిశోధకులు తాజా అధ్యయనంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ను కనుగొన్నట్లు తెలుస్తోంది. మూడో వేవ్‌లో బయటపడ్డ బీఏ2(BA2) వేరియంట్ కంటే.. ఈ బీఏ(BA12) 10 రెట్ల ప్రమాదకారి అని.. వేగంగా వ్యాపించే గుణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

“దేశంలో పెరుగుతోన్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని.. ఒమిక్రాన్ వేరియంట్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం ప్రారంభించాం. 13 నమూనాలు పరీక్షించగా అందులో ఒకటి బీఏ 12 జాతి కలిగి ఉంది. మిగిలిన 12.. బీఏ2 జాతి కలిగి ఉన్నాయి” అని IGIMS మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నమ్రత కుమారి తెలిపారు

“బీఏ2 వేరియంట్ కంటే బీఏ12 వేరియంట్ 10 రెట్ల ప్రమాదకరం అయినా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందు జాగ్రత్తలు తీసుకుంటే దాని వ్యాప్తిని నివారించవచ్చునని” ఆమె అన్నారు. కాగా, బీఏ12 వేరియంట్ మొదట అమెరికాలో కనుగొన్నారు. అటు ఢిల్లీలో మూడు పాజిటివ్ కేసుల్లో రెండింటి నమూనాలలో బీఏ12 వేరియంట్‌ను గుర్తించగా.. ఇప్పుడు పాట్నాలో ఈ వేరియంట్‌తో మరో కేసు బయటపడింది.

Loading...
Unable to load recommendations.
Follow Us