నేడు నీట్‌ కౌన్సెలింగ్‌ రెండో విడత తుది ఫలితాలు.. అభ్యర్థులు తమ ఫలితాలను ఈ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు…

నీట్ 2020 కౌన్సెలింగ్ రెండో విడత సీట్ల కేటాయింపునకు సంబంధించి తుది విడత ఫలితాలు నెడు వెలువడనున్నాయి. ఇవాళ సాయంత్రం..

నేడు నీట్‌ కౌన్సెలింగ్‌ రెండో విడత తుది ఫలితాలు.. అభ్యర్థులు తమ ఫలితాలను ఈ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు...
Follow us

|

Updated on: Nov 30, 2020 | 12:26 PM

నీట్ 2020 యూజీ కౌన్సెలింగ్ రెండో విడత సీట్ల కేటాయింపునకు సంబంధించి తుది విడత ఫలితాలు నెడు వెలువడనున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఈ ఫలితాలను విడుదల చేయనుంది. రెండో విడత కౌన్సిలింగ్‌ ఫలితాల కోసం అభ్యర్థులు mcc.nic.in వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. వైద్య విద్య కళాశాలల్లో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీలో భాగంగా యూజీ కౌన్సెలింగ్ రెండో విడత తాత్కాలిక ఫలితాలను ఈ నెల 28వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తుది జాబితాను విడుదల చేయనున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2020 ఫలితాలు అక్టోబర్‌ 16వ తేదీన వెలువడ్డాయి. మొదటి రౌండ్ వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు రెండో రౌండ్ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి నేడు తుది ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేయనుంది.