
విద్యార్థులను చక్కదిద్దాల్సిన స్కూల్ కమిటీ.. వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వారు తీసుకున్నఆ నిర్ణయం ఇప్పుడు దేశవ్యప్తంగా చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా నమ్లీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పాఠశాల కమిటీ విద్యార్థుల టాయిలెట్లలో కెమెరాలను అమర్చింది. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ బాలల కమిషన్ స్పందించింది. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి పొరపాటు లేదంటు రాష్ట్ర బాలల కమిషన్ స్కూల్ కమిటీకి క్లీన్ చిట్ ఇచ్చింది.
రాష్ట్ర బాలల కమిషన్ బృందం విచారణ
రత్లాం జిల్లా నమ్లీలో ఉన్న సెయింట్ జోసెఫ్ పాఠశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విద్యార్థుల టాయిలెట్లలో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని నిర్ణయం తీసుకుంది పాఠశాల కమిటీ. ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు రాష్ట్ర బాలల కమిషన్‌కు చేరడంతో రాష్ట్ర బాలల కమిషన్ బృందం పాఠశాలను తనిఖీ చేసింది. రాష్ట్ర బాలల కమిషన్ బృందం విచారణ జరిపి స్కూల్ కమిటీని విచారణ చేసింది. కారణాలను అడిగి తెలుసకుంది. పాఠశాల కమిటీ తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని క్లీన్ చిట్ చేసింది. టాయిలెట్‌లో స్టూడెంట్స్ అశ్లీల చిత్రాలు చేసేవారని.. వాటికి చెక్ పెట్టేందుకే సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లుగా సెయింట్ జోసెఫ్ స్కూల్ కమిటీ స్పష్టం చేసింది.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పాఠశాల కమిటీ వివరణ ఇస్తూ కొన్ని ఆధారాలను కూడా సమర్పించింది. అనంతరం స్కూల్ కమిటీకి రాష్ట్ర బాలల కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయం బాలల జాతీయ కమిషన్‌కు చేరడంతో మరోసారి పాఠశాల కమిటీ కష్టాలు మొదలయ్యాయి. జాతీయ బాలల కమిషన్ ఆదేశాలతో రత్లాం పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు..
రత్లాం ఎస్పీ అభిషేక్ తివారీ మాట్లాడుతూ.. సెయింట్ జోసెఫ్ స్కూల్ విషయంలో నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ నుంచి లేఖ అందిందని తెలిపారు. పాఠశాల మరుగుదొడ్లలో కెమెరాల విషయంలో అవసరమైన విచారణ చేపట్టాలని ఇందులో పేర్కొన్నారు. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు రత్లాం ఎస్పీ అభిషేక్ తివారీ తెలిపారు. దీంతోపాటు పోలీసు అధికారుల బృందం విచారణ చేస్తోంది. ఏ చట్టం వచ్చినా దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం.
మరిన్ని జాతీయ వార్తల కోసం