PM Modi TV9 Exclusive Interview: అప్పుడు కమ్యూనిస్టులు.. ఇప్పుడు తృణముల్.. బెంగాల్ రాజకీయాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది.. దేశం మొత్తంతో పాటు బెంగాల్ లోక్ సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 స్థానాలకు గాను 18 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అప్పటినుంచి కాషాయదళం.. బెంగాల్ పై దృష్టిసారించింది. ఈసారి కాషాయపార్టీ బెంగాల్ నుంచి 30 నుంచి 35 సీట్లు దక్కించుకోవాలని వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

PM Modi TV9 Exclusive Interview: అప్పుడు కమ్యూనిస్టులు.. ఇప్పుడు తృణముల్.. బెంగాల్ రాజకీయాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు..
Pm Modi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 03, 2024 | 7:23 AM

లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది.. దేశం మొత్తంతో పాటు బెంగాల్ లోక్ సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 స్థానాలకు గాను 18 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అప్పటినుంచి కాషాయదళం.. బెంగాల్ పై దృష్టిసారించింది. ఈసారి కాషాయపార్టీ బెంగాల్ నుంచి 30 నుంచి 35 సీట్లు దక్కించుకోవాలని వ్యూహంతో ముందుకు వెళ్తోంది. గత కొన్ని వారాలుగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో టీవీ9 నెట్‌వర్క్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తృణముల్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. వామపక్షాల శకం ముగిసిందని.. ప్రస్తుతం తృణమూల్‌ శకం ముగుస్తోందని మోదీ అన్నారు.. వారి వల్లే బెంగాల్ వెనుకబడిందన్నారు. దేశం ముందుకు నడవాలంటే బెంగాల్ ముందుండాలంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారతదేశం అభివృద్ధి చెందాలంటే దేశంలోని కొన్ని రాష్ట్రాల పాత్ర ఎంతో కీలకమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి ఉన్న రాష్ట్రాల్లో బెంగాల్ కూడా ఉంది. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, బెంగాల్ సామాజిక ప్రగతిని సాధించినట్లు కనిపిస్తుంది. బెంగాల్ విప్లవాత్మక ఉద్యమం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముందంజలో ఉంది. ఇక్కడితో ఆగకుండా, ‘భారతదేశం పేరు ప్రపంచంలో విస్తరించడం వెనుక బెంగాల్ హస్తం ఉంది. ఈ సందర్భంలో మీరు రవీంద్రనాథ్ ఠాగూర్‌తో పాటు వివేకానంద, జగదీష్ చంద్రబోస్ పేర్లను కూడా పేర్కొనవచ్చు. కానీ వామపక్షాలు బెంగాల్ సంప్రదాయానికి స్వస్తి పలికాయి. దేశం ముందుకు సాగాలంటే బెంగాల్ పునరుజ్జీవనం కావాలి.. అంటూ మోదీ వివరించారు.

ఈ ఇంటర్వ్యూలో మోదీ ఎన్నికల ప్రక్రియ, రామమందిరం, పరిరక్షణ మొదలుకొని అనేక అంశాలపై మాట్లాడారు. 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో చేయాల్సి ఉందని తెలిపారు.