PM Modi: పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ రికార్డ్.. ఇంతకీ నమో3.0 ముందున్న లక్ష్యాలేమిటి?

మరికాసేపట్లో నరేంద్ర మోదీ మూడోవసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ.. తన టీమ్‌తో మరోసారి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్‌. ఒక్కడిగా కాదు, అందరితో కలిసి.. అలయన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ కేబినెట్‌ కూర్పు జరగడం కీలకంగా చెప్పొచ్చు.

PM Modi: పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ రికార్డ్.. ఇంతకీ నమో3.0 ముందున్న లక్ష్యాలేమిటి?
Pm Modi Record
Follow us

|

Updated on: Jun 09, 2024 | 7:05 PM

మరికాసేపట్లో నరేంద్ర మోదీ మూడోవసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. పండిట్‌ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్‌ ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీ.. తన టీమ్‌తో మరోసారి సిద్ధమయ్యారు. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్‌. ఒక్కడిగా కాదు, అందరితో కలిసి.. అలయన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ కేబినెట్‌ కూర్పు జరగడం కీలకంగా చెప్పొచ్చు. అందులోనూ ఈ దఫా తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యత, ఎన్డీఏ సర్కార్‌ని సరికొత్తగా ఎలివేట్‌ చేస్తోంది. ఇంతకీ నమో3.0 ముందున్న లక్ష్యాలేమిటి? ఎదుర్కొవాల్సిన సవాళ్లేంటీ?

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీఏ కూటమి.. మరోసారి కేంద్రంలో కొలువుదీరింది. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ.. తన టీమ్‌తో పాలనకు సిద్ధమయ్యారు. రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా,ప్రహ్లాద్‌ జోషి సహా.. దాదాపు 70 మందికిపైగా ఎంపీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. అనురాగ్‌ ఠాకూర్‌, పురుషోత్తం రూపాలా సహా పలువురు సిట్టింగ్‌ మంత్రులకు కేబినెట్‌లో ఛాన్స్‌ దక్కలేదు.

గత రెండు దఫాలు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు.. అన్నట్టుగా కేబినెట్‌ కూర్పు జరిగినట్టు తెలుస్తోంది. భాగస్వామ్య పార్టీలకు కేబినెట్‌ బెర్తుల విషయంలో ప్రాధాన్యత పెరిగినట్టు కనిపిస్తోంది. కూటమిలో భాగమైన ఇతర పార్టీలకు… దాదాపు 12 కేబినెట్‌ పదువులు కేటాయించింది బీజేపీ అధిష్ఠానం. 2014, 2019 ఎన్నికల్లో ఈస్థాయి మంత్రిపదవులను మిత్రపక్షాలకు కేటాయించలేదు. ఈసారి దక్షిణాది నుంచి కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మంచిప్రాతినిథ్యం దక్కింది.

ముఖ్యంగా కేబినెట్‌ కూర్పులో.. తెలుగు రాష్ట్రాలకు ఈసారి అగ్రపీఠం వేసింది బీజేపీ అధిష్టానం. ఏపీ నుంచి మూడు కేంద్ర మంత్రిపదవులను కట్టబెట్టింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, గుంటూరు నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌, నరసరాపురం ఎంపీ శ్రీనివాస వర్మలకు.. కేంద్ర మంత్రులకు అవకాశం దక్కడం విశేషం. కారణాలేమిటనేది తెలియదుగానీ, కూటమిలో భాగంగా ఉన్న జనసేనకు మాత్రం.. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కలేదు.

తెలంగాణకు ఈసారి రెండు కేంద్ర మంత్రిపదవులు దక్కాయి. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా కొనసాగిన సికిందరాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి మరోసారి ఛాన్స్‌ ఇచ్చారు మోదీ. కొత్తగా, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు.

మిత్రపక్షాల సమ్మిళితంగా.. అందరికీ ప్రాధాన్యమిచ్చేలా ఏర్పడిన మోదీ 3.ఓ టీమ్‌.. రాబోయే రోజుల్లో ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తుంది? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోనుంది? అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే, గత రెండు దఫాలు ఫుల్‌ మెజార్టీతో ఉన్న బీజేపీ.. ఈసారి మిత్ర పక్షాల సపోర్టుతో గద్దెనెక్కిన పరిస్థితి. మరి, మూడో దఫా మోదీ పాలనలో.. భవిష్యత్‌ భారతం ఎలా ఉంటుందో చూడాలి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్