రాజస్తాన్ లోని నిమోడియా అనే గ్రామంలో ఈ మధ్య ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఓ నల్లని మేకపిల్ల మనిషి ముఖంతో పుట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మనిషి కళ్ళు, నోరు వంటి అవయవాలతో పుట్టిన ఈ మేకను అంతా భగవంతుని అవతారమేనని పూజించడం మొదలెట్టారు.
ఈ మేక తాలూకు వీడియోను దీని యజమాని ముకేష్ జీ ప్రజాపాప్ రిలీజ్ చేశారు. అయితే ‘సైక్లోపియా ‘ అనే జన్యు సంబంధ లోపమే ఇది ఇలా పుట్టడానికి కారణమంటున్నారు. ఇక-2017 లో కూడా అస్సాం లోని ఓ గ్రామంలో ఒంటి కన్నుతో జన్మించిన మేకపిల్ల సంచలనం రేపింది. దానికి చెవులు, కనుబొమలు ఉన్నాయి. అయితే ముక్కుభాగం దాదాపు మూసుకుపోయింది.. కాగా.. ఇలా జన్యు లోపంతో పుట్టిన జీవాలు ఎక్కువకాలం జీవించలేవని అంటున్నారు.