ముంబైలో ఓ మహిళ ‘ సాహసం’, ఓపెన్ మ్యాన్ హోల్ పై నిలబడి వార్నింగ్

ముంబైలో ఓ మహిళ ' సాహసం', ఓపెన్ మ్యాన్ హోల్ పై నిలబడి వార్నింగ్

భారీ వర్షాలతో తల్లడిల్లిన ముంబై నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పరిస్థితి కొంత మెరుగు పడినప్పటికీ రోడ్లు చాలావరకు చెరువులను తలపిస్తున్నాయి.. వెస్ట్ ముంబైలో ఓ మహిళ..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Aug 08, 2020 | 6:13 PM

భారీ వర్షాలతో తల్లడిల్లిన ముంబై నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పరిస్థితి కొంత మెరుగు పడినప్పటికీ రోడ్లు చాలావరకు చెరువులను తలపిస్తున్నాయి.. వెస్ట్ ముంబైలో ఓ మహిళ ఓపెన్ మ్యాన్ హోల్ పై నిలబడి..ఇక్కడ డేంజర్ పొంచి ఉంది సుమా అని వాహనదారులను హెచ్చరిస్తోంది. సుమారు 5 గంటలపాటు ఆమె అలాగే నిలబడి తన ‘సేవా ధర్మాన్ని’ చాటడం విశేషమని ప్రత్యక్ష సాక్షులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇది ఆమె నిస్వార్ధం తప్ప మరేమీ కాదని పలువురు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇలాంటి మహిళ మీకెక్కడైనా తారసపడిందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఆమె ఎవరో అనేకమందికి తెలియకపోయినా వీడియోను షేర్ చేయడం ద్వారా తామూ ఈ ఉదాత్తతలో భాగస్వాములేనని వీరు తృప్తి పడుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu