అయోధ్య రామాలయ నిర్మాణానికి మొఘల్ వారసుడి కానుక

ప్రఖ్యాత అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ తన కానుకను ప్రకటించారు. అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని ఆయన వెల్లడించారు.

అయోధ్య రామాలయ నిర్మాణానికి మొఘల్ వారసుడి కానుక
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 2:39 PM

ప్రఖ్యాత అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ తన కానుకను ప్రకటించారు. అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని ఆయన వెల్లడించారు. మాట ఇచ్చినట్లుగానే మొఘల్ వంశం తరఫున కిలో బరువున్న ఓ ఇటుకను ప్రధాని మోదీకి అందిస్తానని., దాన్ని ఆలయ నిర్మాణంలో వాడొచ్చని యాకుబ్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వమని తాను కోరానని.. ఆయన నుంచి పిలుపు రావాల్సి ఉందని వివరించారు. కాగా మొఘలుల వారసుడిగా చెప్పుకునే యాకూబ్‌ తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్‌గా నియమించాలని డిమాండ్‌ చేస్తూ వార్తల్లోకెక్కారు.

కాగా ఆగస్టు 5న మధ్యాహ్నం గం.12.15ని.లకు అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో కొద్ది మంది ప్రముఖులే పాల్గొనబోతున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే రెండుసార్లు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే.

Read This Story Also: Raghu Master: ఈసారి అవకాశం వదులుకోకూడదు అనుకున్నా