Raghu Master: ఈసారి అవకాశం వదులుకోకూడదు అనుకున్నా

బుల్లితెర సీరియల్స్‌ ఎప్పుడో స్టార్ట్‌ అయిపోయాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి బిగ్‌బాస్‌పై ఉంది. కరోనా నేపథ్యంలో ఈ సారి బిగ్‌బాస్‌ ఉంటుందా..? ఉండదా..? అన్న వార్తలకు ఇటీవలే చెక్‌ పెట్టారు నిర్వాహకులు.

Raghu Master: ఈసారి అవకాశం వదులుకోకూడదు అనుకున్నా
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 2:06 PM

Raghu Master in Bigg Boss 4: బుల్లితెర సీరియల్స్‌ ఎప్పుడో స్టార్ట్‌ అయిపోయాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి బిగ్‌బాస్‌పై ఉంది. కరోనా నేపథ్యంలో ఈ సారి బిగ్‌బాస్‌ ఉంటుందా..? ఉండదా..? అన్న వార్తలకు ఇటీవలే చెక్‌ పెట్టారు నిర్వాహకులు. బిగ్‌బాస్‌ 4 త్వరలోనే రానుందని ఓ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారన్న చర్చ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో తాను ఉండబోతున్నట్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు డ్యాన్స్ కంపోజర్ రఘు మాస్టర్‌.

దీనిపై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘు మాస్టర్‌.. ”బిగ్‌బాస్‌ 4 కోసం నన్ను సంప్రదించారు. ఈ సీజన్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ముందు సీజన్‌లకు కూడా నన్ను సంప్రదించారు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. అప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండటం వలన బిగ్‌బాస్‌కి ఒప్పుకోలేదు. అయితే ఈ సారి మాత్రం నేను వదులుకోవాలనుకోవడం లేదు” అని చెప్పుకొచ్చారు.

ఇక కరోనా పరిస్థితుల్లో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీపై స్పందిస్తూ.. ”ఈ సమయంలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తున్నా. లాక్‌డౌన్‌కి ముందు జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని షూటింగ్‌ల్లో పాల్గొన్నా. అప్పుడు ఏ ఇబ్బందులు ఎదుర్కొనలేదు. చాలా రోజులు ఇళ్లకే పరిమితం అవ్వడం వలన ఎలాంటి లాభం లేదు. పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకొని వెళ్లాలి. ఈ సారి సీజన్‌లో మార్పులు ఉంటాయని అనుకుంటున్నా. ఛాలెంజ్‌లను ఎదుర్కొనేందుకు ఎదురుచూస్తున్నా అని రఘు మాస్టర్ వెల్లడించారు. ఇక అంతకుముందు కూడా షూటింగ్‌ల వలన ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని.. ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఎక్కువ ఉండాల్సి వస్తుంది” అని వివరించారు. మొత్తానికి రఘు మాస్టర్ కన్ఫర్మేషన్‌లో ఈ సీజన్‌లో పాల్గొనబోయే ఒక కంటెస్టెంట్‌ పేరు తెలిసింది.

Read This Story Also: KGF Chapter 2: అరివీర భయంకర ‘అధీర’ వచ్చేస్తున్నాడు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!