Modi Cabinet Decisions: ఆత్మ నిర్భర్‌ భారత్‌ కోసం మూడు కీలక నిర్ణయాలు.. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం

ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమంగా భాగంగా 14 రంగాలకు మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. పీఎల్‌ఐ స్కీమ్‌ కింద సౌరశక్తి రంగానికి భారీగా నిధులు విడుదల చేశారు. నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Modi Cabinet Decisions: ఆత్మ నిర్భర్‌ భారత్‌ కోసం మూడు కీలక నిర్ణయాలు.. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం
Pm Narendra Modi
Follow us

|

Updated on: Sep 21, 2022 | 9:02 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు పీఎల్‌ఐ స్కీమ్ తీసుకొచ్చింది. పీఎల్‌ఐ స్కీమ్ కిందకు సోలార్ ప్యానెళ్లను తెచ్చారు. సెమీ కండక్టర్ల అభివృద్ధి విధానానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 17న ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2030 నాటికి టాప్ 25 దేశాల్లో చేరేలా లాజిస్టిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ మెరుగుపరుచుకునే చర్యలు చేపడ్తారు. వస్తువులు దేశవ్యాప్తంగా అంతరాయాలు లేకుండా రవాణా అయ్యే విధంగా చేయడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రాసెస్ రీ ఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌లపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది.

హై ఎఫిషియెన్సీ సోలార్ పివి మాడ్యూల్ ట్రాన్స్-2 కోసం పిఎల్‌ఐ స్కీమ్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.19,500 కోట్లు కేటాయించినట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అలాగే 14 ప్రాంతాల్లో పీఎల్‌ఐ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంతో దేశంలో సోలార్ ప్లేట్ల తయారీకి ఊతం లభిస్తుంది. సెమీ కండక్టర్లు, డిస్‌ప్లేల ఉత్పత్తికి సంబంధించి రెండో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ విధానం మరింత ఆకర్షణీయంగా తయారైంది.

దేశం నలుమూలలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా వస్తువులు, ఉత్పత్తుల రవాణా జరగాలనే లక్ష్యంతో నేషనల్‌ లాజిస్టిక్‌ విధానాన్ని రూపొందించారు. ప్రాసెస్ రీఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్‌లపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది.

లాజిస్టిక్స్ కోసం జీడీపీలో దాదాపు 14 శాతం వరకు ఖర్చవుతుండటంతో దీనిని తగ్గించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, లాజిస్టిక్స్ సెక్టర్లో 22 మిలియన్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. పరోక్ష లాజిస్టిక్స్ ఖర్చులు 10 శాతం తగ్గే విధంగా ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ నూతన విధానం లక్ష్యం. దీనివల్ల ఎగుమతులు ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు వృద్ది చెందుతాయని అంచనా వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం 

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో