కర్నాటక లోని బీదర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దసరా సందర్భంగా మహమద్ గవాన్ మదర్సా లో కొందరు దూసుకెళ్లి పూజలు చేయడంపై వివాదం నెలకొంది. మహమద్ గవాన్ మదర్సా దగ్గర భారీగా పోలీసు బందోబస్తున్న ఏర్పాటు చేశారు. మహమద్ గవాన్ మదరసాను భారత పురావస్తు శాఖ వారసత్వ కట్టడంగా గుర్తించింది. మదర్సా లోకి ప్రవేశించిన కొంతమంది నానా హంగామా చేశారు. ఈ ఘటనలో పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. మహమద్ గవాన్ మదర్సా లోకి దూసుకెళ్లిన నలుగురిని అరెస్ట్ చేశారు.
బీదర్‌లో ఉన్న మదరసాను 1460లో నిర్మించారు. దీన్ని మహమద్ గవాన్ మదర్సా అని పిలుస్తున్నారు. చాలా జాతీయ ప్రాముఖ్యత కలగిన కట్టడంగా గుర్తించారు. దసరా పూజలు నిర్వహించడంపై ముస్లిం సంఘాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. మదరాసా దగ్గర భారీ ఎత్తున ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టాయి.
ఈ ఘటనపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ముస్లింలను కించపరిచేందుకు బీజేపీ కావాలనే ఇలాంటి ఘటనలు చేయిస్తోందని ట్వీట్ చేశారు.
Visuals from historic Mahmud Gawan masjid & madrasa, Bidar, #Karnataka (5th October). Extremists broke the gate lock & attempted to desecrate. @bidar_police @BSBommai how can you allow this to happen? BJP is promoting such activity only to demean Muslims pic.twitter.com/WDw1Gd1b93
— Asaduddin Owaisi (@asadowaisi) October 6, 2022
మహమద్ గవాన్ మదర్సా లో దసరా పూజలపై స్పందించారు కర్నాటక హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర. మదర్సాలో ఎప్పటినుంచో శమీ చెట్టు ఉందని , దసరా నాడు ఆ చెట్టుకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గతంలో ఐదుగురు మాత్రమే దసరా నాడు పూజలు చేశేవారని , ఈసారి గుంపులుగా జనం వెళ్లడంతో వివాదం రాజుకుందన్నారు.
బీదర్‌లో పరిస్థితి అదుపు లోనే ఉందని కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. హిందువులు-ముస్లింల మధ్య అక్కడ గొడవలు లేవని స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..