నూతన వ్యవసాయ చట్టం… ట్రాక్టర్ మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు… ధర్నాకు దిగిన రైతులు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్నారు. డిసెంబర్ 14న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

నూతన వ్యవసాయ చట్టం... ట్రాక్టర్ మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు... ధర్నాకు దిగిన రైతులు
Follow us

| Edited By:

Updated on: Dec 14, 2020 | 7:53 AM

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్నారు. డిసెంబర్ 14న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అలాగే ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాల్లో అన్ని రైతు సంఘాల నేతలు డిసెంబర్ 14 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

రైతు నాయకుడు గుర్నామ్‌ సింగ్‌ చారుణి సింఘు సరిహద్దులో విలేకరులతో మాట్లాడుతూ…. ‘కొన్ని రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటిస్తున్నాయి. వారితో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేస్తున్నా. ప్రభుత్వంతో చేతులు కలిపి, వారు మా ఉద్యమానికి వెన్నుపోటు పొడవాలని కుట్రపన్నారు’ అని ఆయన మండిపడ్డారు. ‘రైతులు ఢిల్లీకి రాకుండా ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయి. కానీ మా ఉద్యమం ఆగదు. ఉద్యమంలో భాగమైన అన్ని రైతు సంఘాలు ఐక్యంగా ఉన్నాయి’ అని మరో రైతు నాయకుడు శివకుమార్‌ కక్కా పేర్కొన్నారు. సంప్రదింపులకు ప్రభుత్వం మరో ప్రతిపాదన పంపితే, దానిపై ఒక కమిటీ ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ తెలిపారు.

డిసెంబర్ 19 నుంచి చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షను రద్దు చేశామని, అందుకుబదులుగా డిసెంబర్ 14న ఒక్కరోజు నిరాహారదీక్ష చేస్తున్నామని మరో నేత సందీప్‌ గిడ్డే చెప్పారు. మరోవైపు, రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్‌ నుంచి ట్రాక్టర్‌ మార్చ్‌ చేపట్టిన రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఎన్‌హెచ్‌-8పై ధర్నాకు దిగారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు.