
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి. మన దేశంలో రోజుకూ సుమారుగా 13 వేలకు పైగా ట్రైన్స్ పట్టాలపై పరుగులు పెడతాయి. ఈ రైళ్లు దాదాపుగా దేశ వ్యాప్తంగా 7,000 స్టేషన్లను కలుపుతూ రాకపోకలు సాగిస్తాయి. అయితే కొన్ని స్టేషన్‌ల నుంచి మనం సెలెక్టెడ్ ప్రాంతాలకు మాత్రమే వెళ్లగలం.. ఆ స్టేషన్ నుంచి దేశం మొత్తం తిరగలేం. కానీ ఇక్కడో స్టేషన్ నుంచి మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాలకు మనం ప్రయాణం చేయవచ్చు. అవును మథుర రైల్వే స్టేషన్‌లో 24 గంటల పాటు దేశంలోని ప్రతి ప్రాంతానికి రాకపోకలు సాగించే ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ నుంచి రోజూ 197 రైళ్లు రాకపోకాలు సాగిస్తాయి.
భారతదేశ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం వైపు ప్రయాణించే ప్రతి రైలు మధుర జంక్షన్‌లో ఆగుతుంది. ఇది సుదూర ప్రయాణానికి ముఖ్యమైన కేంద్రంగా మారుతుంది. ఇక్కడి నుండి, ప్రయాణీకులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, అనేక ఇతర ప్రాంతాలతో సహా ప్రధాన నగరాలు,రాష్ట్రాలకు ప్రయాణించవచ్చు. అలాగే ఈ స్టేషన్ శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన మధురలో ఉండడంతో దీనికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మధుర నుండి 11 కి.మీ దూరంలో ఉన్న బృందావనంలోనే శ్రీకృష్ణుడి బాల్యం మొత్తం గడిచిందని పురణాలు చెబుతాయి. అందుకే ఈ ప్రాంతాన్ని చూసేందుకు దేశ నలుమూల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడివి వస్తారు.
ఈ స్టేషన్‌ను ఎప్పుడు నిర్మించారు.
మథురాలో రైల్వే కనెక్టివిటీని 1875లో ప్రారంభించారు. తొలి సారిగా హత్రాస్ రోడ్ నుండి మథురా క్యాంటోన్మెంట్ వరకు ఈ రైల్వే లైన్‌ను అప్పటి బాంబే, బరోడా సెంట్రల్ ఇండియా ఆద్వర్యంలో నిర్మించారు. ఆ తర్వాత 1881లో అచ్నేరా-మథురా లైన్, 1889లో మథురా-వృందావన్ రైల్వే లైన్స్‌ను స్టార్ట్ చేశారు. ఇలా కాలక్రమేనా రైల్వే లైన్స్‌లు పెరిగి ఈ స్టేషన్ దేశ నలుదిక్కుల ప్రాంతాలకు రైల్వే సేవలను అందించడం ప్రారంభించింది. ఈ స్టేషన్‌లో దాదాపు 10 నుంచి 14 ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.