కరోనా బాధితులా ? డ్యాన్సర్లా ? ఐసొలేషన్ కేంద్రంలో వెరైటీ సీన్ !

కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న చైనాలోని వూహాన్ సిటీ నుంచి ఢిల్లీకి తిరిగి వఛ్చిన భారతీయుల్లో  సుమారు 300 మందిని ఢిల్లీ సమీపంలోని మానెసార్ లో గల ప్రత్యేక కేంద్రంలో ఉంచారు. ఈ ప్రపంచం నుంచి వీరిని పూర్తిగా వేరు చేసి.. ఐసొ లేషన్ లో ఉంచినప్పటికీ వీరిలో చాలామంది స్పిరిట్, ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఈ కేంద్రంలో వీరు ముఖాలకు మాస్కులను ధరించే పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ వీడియోకెక్కారు. మూడు లే‌యర్లు గల మాస్కులు […]

కరోనా బాధితులా ? డ్యాన్సర్లా ? ఐసొలేషన్ కేంద్రంలో వెరైటీ సీన్ !

కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న చైనాలోని వూహాన్ సిటీ నుంచి ఢిల్లీకి తిరిగి వఛ్చిన భారతీయుల్లో  సుమారు 300 మందిని ఢిల్లీ సమీపంలోని మానెసార్ లో గల ప్రత్యేక కేంద్రంలో ఉంచారు. ఈ ప్రపంచం నుంచి వీరిని పూర్తిగా వేరు చేసి.. ఐసొ లేషన్ లో ఉంచినప్పటికీ వీరిలో చాలామంది స్పిరిట్, ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఈ కేంద్రంలో వీరు ముఖాలకు మాస్కులను ధరించే పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ వీడియోకెక్కారు.

మూడు లే‌యర్లు గల మాస్కులు కూడా వీరి జోరును అదుపు చేయలేకపోయాయి.  వీరికి ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.  కరోనా లక్షణాలేవీ లేవని   తేలాక.. 14 రోజుల తరువాతే ఈ యువకులను వారి ఇళ్లకుపంపుతారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ కేంద్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్లో సుమారు 50 మంది ఉంటారు. నిజానికి  ఈ బృందం వేటికవే వేరుగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ యువకులంతా దొడ్డిదారిన ఏదో ఒక సమయంలో కలుసుకుని ఇలా డ్యాన్సులతో ఎంజాయ్ చేస్తున్నారు. వీరి తాలూకు వీడియోను ఎయిరిండియా అధికార ప్రతినిధి ధనుంజయ కుమార్ రిలీజ్ చేశారు.

Published On - 4:07 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu