Bjp Chief Jp Nadda: అహంకారం వల్లే మమత రైతు చట్టాలను అమలు చేయడంలేదు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

| Edited By: Pardhasaradhi Peri

Feb 06, 2021 | 3:47 PM

తన అహంకారం వల్లే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలను అమలు చేయలేదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. ఆమె 'ఇగో' కారణంగా..

Bjp Chief Jp Nadda: అహంకారం వల్లే మమత రైతు చట్టాలను అమలు చేయడంలేదు.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
Follow us on

తన అహంకారం వల్లే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలను అమలు చేయలేదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. ఆమె ‘ఇగో’ కారణంగా ఇక్కడి రైతులు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందలేకపోయారన్నారు. మాల్దాలో శనివారం జరిగిన రోడ్ షో లో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ రాష్ట్ర ప్రజలు మమతకు, ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ‘టాటా’ చెప్పడం  ఖాయమని అన్నారు. తన అహాన్ని తృప్తి పరచేందుకే మమత రైతు సంక్షేమ పథకాల అమలుకు అంగీకరించడంలేదని ఆయన విమర్శించారు. కానీ రైతులు వీటిని సమ్మతించిన అనంతరం తాము అమలు చేస్తామని  ఆమె ఇప్పుడు హామీ ఇస్తున్నారని, ఇది వంచనే అని నడ్డా అన్నారు. గత 2 సంవత్సరాలుగా బెంగాల్ లోని 70 లక్షలమంది రైతులు తమకు ఏటా అందాల్సిన 6 వేలరూపాయల సాయాన్ని అందుకోలేకపోయారని నడ్డా పేర్కొన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోకాలడ్డుతున్నారన్నారు.

మాల్దాలోనెలరోజులుగా బీజేపీ చేబట్టిన కృషక్ సురక్షా అభియాన్ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఇదే సందర్భంగా నడ్డా తమ రోడ్ షో ని దాదాపు ఎన్నికల ప్రచార సభలా వినియోగించుకున్నారు.  సుమారు కిలోమీటర్ దూరం మేరా ఈ రోడ్ షో సాగింది. పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ షో లో పాల్గొన్నారు.

 

Read More:

ఆ యువకుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు నారా లోకేష్‌ లేఖ

మావోయిస్టుల ఏరివేతకు మహిళా కమెండోలు.. మహిళా బెటాలియన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న కమెండోలు

మావోయిస్టుల ఏరివేతకు మహిళా కమెండోలు.. మహిళా బెటాలియన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న కమెండోలు