ఇదేం వింత.. పాలిస్తున్న మగ మేక

| Edited By:

Jul 29, 2020 | 12:56 PM

రాజస్థాన్‌లో ఓ వింత చోటుచేసుకుంది. ఓ మగ మేక పాలిస్తోంది. ధోల్పూర్‌ జిల్లాలోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్‌ కుష్వాహా.. ఓ మేకను కొనుగోలు చేశాడు. అయితే ఆరు నెలల తర్వాత ఆ మేక పొదుగు..

ఇదేం వింత.. పాలిస్తున్న మగ మేక
Follow us on

రాజస్థాన్‌లో ఓ వింత చోటుచేసుకుంది. ఓ మగ మేక పాలిస్తోంది. ధోల్పూర్‌ జిల్లాలోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్‌ కుష్వాహా.. ఓ మేకను కొనుగోలు చేశాడు. అయితే ఆరు నెలల తర్వాత ఆ మేక పొదుగు పెరగడంతో ఆశ్చార్యానికి గురయ్యాడు. పొదుగును పితకగా.. పాలు రావడాన్ని గమనించాడు. ప్రతి రోజు దాదాపు 200 నుంచి 250 గ్రాముల పాలను ఇస్తున్నట్లు మేక యజమాని తెలిపారు. అయితే మేక ఇలా పాలు ఇచ్చే విషయంపై వెటర్నరీ డాక్టర్లని కలిశారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మగ మేక పాలు ఇస్తుందని వైద్యులు తెలిపారు. ఇక ఈ వింత సంఘటనను చూసిన గ్రామస్థులు.. మగ మేక పాలివ్వడం ఇదే తొలిసారి అని.. ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు కూడా చూడలేదన్నారు.