MSRTC Strike: మహారాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఆరువేల ఉద్యోగుల సస్పెండ్‌.. ఉపాధి కోల్పోయిన కార్మికులు..!

MSRTC Strike: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆరు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్సెండ్‌ చేసింది. రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ..

MSRTC Strike: మహారాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఆరువేల ఉద్యోగుల సస్పెండ్‌.. ఉపాధి కోల్పోయిన కార్మికులు..!
Follow us

|

Updated on: Nov 28, 2021 | 2:01 PM

MSRTC Strike: మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆరు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్సెండ్‌ చేసింది. రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు గత నెల రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై మహారాష్ట్ర ఆర్టీసీ మండిపడింది. వారిపై క్రమ శిక్షణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా శనివారం 3010 మంది ఉద్యోగులను సస్సెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీంతో ఇప్పటి వరకు సస్సెండ్‌ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా, 1496 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక మొత్తం 92,266 మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో 18 వేల వరకు తిరిగి శనివారం విధుల్లో చేరారు. అయితే ఇంకొందరు డ్యూటీలో చేరేందుకు ఈ రోజు వరకు సమయం ఇచ్చింది ప్రభుత్వం. అలాగే ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో సమీక్షించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వం జీతాల పెంపును ప్రకటించడంతో పలువురు ఉద్యోగులు విధుల్లో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. కొందరు ఉద్యోగులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, వారు కూడా వెంటనే చేరాలని మంత్రి కోరారు.

ఇవి కూడా చదవండి:

TATA Group: టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం.. కొత్త వ్యాపారంలోకి అడుగులు.. రూ.2,220 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌..!

Indian Railway: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్న భారత్‌.. 12 గంటలకు బదులు 2 గంటలే ప్రయాణం..!