Viral Video: చిరుతపులి వేషంలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలో చిరుతపులులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మానవ నివాసాలపై దాడులు పెరిగాయి., ఫలితంగా అనేక మంది పిల్లలు మరణించారు. ఈ తీవ్రమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఓ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పూణే జిల్లాలోని జున్నార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శరద్ సోనావానే శీతాకాల సమావేశాల సందర్భంగా చిరుతపులి వేషంలో నాగ్‌పూర్‌లోని అసెంబ్లీకి వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది.

Viral Video: చిరుతపులి వేషంలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
Mla Sharad Sonawane Dressed As Leopard

Updated on: Dec 11, 2025 | 4:54 PM

మహారాష్ట్రలో చిరుతపులులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మానవ నివాసాలపై దాడులు పెరిగాయి., ఫలితంగా అనేక మంది పిల్లలు మరణించారు. ఈ తీవ్రమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఓ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పూణే జిల్లాలోని జున్నార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శరద్ సోనావానే శీతాకాల సమావేశాల సందర్భంగా చిరుతపులి వేషంలో నాగ్‌పూర్‌లోని అసెంబ్లీకి వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది.

పశ్చిమ మహారాష్ట్రలోని జున్నార్ తాలూకా, అహల్యానగర్, షోలాపూర్, నాసిక్, ధూలే, ముంబై చుట్టుపక్కల ప్రాంతాలు, మరాఠ్వాడ, విదర్భలోని నాగ్‌పూర్ ప్రాంతంలో చిరుతలు, పులులు దాడి చేస్తున్నాయి. చిరుతలు నాగ్‌పూర్ సరిహద్దుకు కూడా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిరుతపులుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే శరద్ సోనావానే ఈ పద్దతిని ఎంచుకున్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిన శీతాకాల సమావేశాల సందర్భంగా, ఎమ్మెల్యే శరద్ సోనావానే చిరుతపులి వేషంలో అసెంబ్లీకి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే శరద్ సోనావానే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9,000-10,000 చిరుతలు ఉన్నాయని అన్నారు. గత మూడు నెలల్లో జున్నార్ తాలూకాలోనే చిరుతపులి దాడుల్లో 55 మంది మరణించారని ఆయన పేర్కొన్నారు . దాడుల సంఖ్య పెరగడం వల్ల పిల్లలు ఇకపై వారి ప్రాంగణాల్లో లేదా వీధుల్లో కనిపించడం లేదని, పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని ఎమ్మెల్యే అసెంబ్లీకి తెలిపారు. చిరుతలు ఇప్పుడు అడవి నుండి బయటకు వచ్చి ఇప్పుడు చెరకు తోటలు, ఇళ్లపై దాడులు చేస్తున్నాయన్నారు. అవి ఇప్పుడు రాత్రిపూట మాత్రమే కాకుండా పగటిపూట కూడా జనంపై దాడి చేస్తున్నాయని తెలిపారు. చిరుతపులి దాడులు పెరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే సోనావానే ఆరోపించారు. చిరుతపులిని పట్టుకునే బదులు, ప్రభుత్వం మహిళలు, రైతులు, పిల్లల మెడలో ఇనుప రాడ్లు కట్టాలని సూచిస్తోందని ఆయన అన్నారు.

వీడియో ఇక్కడ చూడండి.. 

ముంబైలోని ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉంటున్న అధికారులకు గ్రామీణ ప్రాంతాల పరిస్థితి, ప్రజల సమస్యల గురించి తెలియక చిరుతపులిని రక్షిస్తున్నారని సోనావానే ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇకపై ఏ రైతు, వారి పిల్లల త్యాగాన్ని తాను సహించనని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమయంలో, బిజెపి నాయకుడు మరియు మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ఎమ్మెల్యే శరద్ సోనావానేను కలిశారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..