Eye Drops: ఈ చుక్కల మందుతో కళ్ల జోడు అవసరమే లేదిక.. ఆమోదించిన భారత ప్రభుత్వం.. మార్కెట్‌లోకి ఎప్పుడంటే?

|

Sep 03, 2024 | 10:08 PM

కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారికి రీడింగ్ గ్లాసెస్‌ను అవసరం లేకుండా సహాయపడే కొత్త కంటి చుక్కల మందుకు భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ప్రెస్‌ బయోపియా చికిత్స కోసం ఈ కొత్త ఐ డ్రాప్స్‌ను తయారు చేసింది.

Eye Drops: ఈ చుక్కల మందుతో కళ్ల జోడు అవసరమే లేదిక.. ఆమోదించిన భారత ప్రభుత్వం.. మార్కెట్‌లోకి ఎప్పుడంటే?
Eye Drops
Follow us on

కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారికి రీడింగ్ గ్లాసెస్‌ను అవసరం లేకుండా సహాయపడే కొత్త కంటి చుక్కల మందుకు భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ ప్రెస్‌ బయోపియా చికిత్స కోసం ఈ కొత్త ఐ డ్రాప్స్‌ను తయారు చేసింది. వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో ప్రెస్‌ బయోపియా అనే సమస్య తలెత్తుతుంది. దీని కారణంగా దగ్గరగా ఉన్న వస్తువులను చూడడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది సాధారణంగా 40వ దశకం మధ్యలో మొదలై 60ల నాటికి తీవ్రంగా పరిణమిస్తుంది. ఈ సమస్యనుఅధిగమించడానికే ప్రెస్‌వు ఐ డ్రాప్స్ ను ఉత్పత్తి చేశారు. ప్రెస్బియోపియా ఉన్నవారిలో రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించడానికి భారత దేశంలో తయారైన మొట్ట మొదటి చుక్కల మందు ఇదే. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) ఉత్పత్తిని ముందుగా సిఫార్సు చేసిన తర్వాత ENTOD ఫార్మాస్యూటికల్స్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుండి తుది ఆమోదం పొందింది.

 

ENTOD ఫార్మాస్యూటికల్స్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి తుది ఆమోదం పొందింది. తయారీదారులు ఈ ప్రత్యేకమైన సూత్రీకరణ మరియు దాని తయారీ ప్రక్రియ కోసం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. యాజమాన్య ఫార్ములా కేవలం రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తొలగించడమే కాకుండా కళ్లను లూబ్రికేట్ చేసే అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.ఈ కంటి చుక్కల మందు అధునాతన డైనమిక్ బఫర్ సాంకేతికతను కలిగి ఉంటాయి., దీర్ఘకాలిక ఉపయోగం కోసం స్థిరమైన సమర్థత, భద్రతను నిర్ధారిస్తాయి. ఈ చుక్కలను సంవత్సరాలుగా ఉపయోగించవచ్చు. “PresVu ఆమోదం అనేది కంటి వైద్యంలో మరొక ముందడుగు. ప్రిస్బియోపియా ఉన్న రోగులకు, ఈ ఐ డ్రాప్ రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండా దగ్గరి దృష్టిని పెంచే నాన్-ఇన్వాసివ్ ఎంపికను అందిస్తుంది. ఇది రోజువారీ జీవితాన్ని, ఉత్పాదకతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. PresVu సమీప దృష్టిని మెరుగుపరచడానికి నాన్-ఇన్వాసివ్ ఎంపికను అందిస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారికి ఇది చాలా మంచి ఔషధం. అని డాక్టర్ ధనంజయ్ బఖ్లే ప్రెస్‌వు క్లినికల్ సంభావ్యత గురించి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ENTOD ఫార్మాస్యూటికల్స్ CEO నిఖిల్ K మసుర్కర్ మాట్లాడుతూ ‘PresVu అనేది సంవత్సరాల కొన్ని సంవత్సరాల పరిశోధనల ఫలితం. దీని ద్వారా మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరచవచ్చు. అక్టోబర్ మొదటి వారం నుండి, ప్రిస్క్రిప్షన్ ఆధారిత కంటి చుక్కలు రూ.350 ధరతో ఫార్మసీలలో అందుబాటులో ఉంటాయి’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..