Kishan Reddy: టీఎంసీ ప్రభుత్వ ప్రవర్తన సిగ్గుచేటు.. రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రపతి ముర్ము ప్రోటోకాల్‌ వివాదంపై మాటలయుద్ధం రాజుకుంది. సంతాల్‌ దివస్‌ కోసం తాను బెంగాల్‌కు వస్తే మమత పట్టించుకోలేదని, ప్రోటోకాల్‌ పాటించలేదని రాష్ట్రపతి ముర్ము విమర్శించడం సంచలనం రేపింది. ఎప్పుడు ప్రశాంతంగా, మౌనంగా ఉండే రాష్ట్రపతి ముర్ములో తొలిసారి బెంగాల్ సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సహజ శైలికి భిన్నంగా, బహిరంగంగానే దీదీపై విమర్శలు చేశారు.

Kishan Reddy: టీఎంసీ ప్రభుత్వ ప్రవర్తన సిగ్గుచేటు.. రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy, President Droupadi Murmu, Mamata Banerjee

Updated on: Mar 08, 2026 | 8:58 AM

రాష్ట్రపతి ముర్ము ప్రోటోకాల్‌ వివాదంపై మాటలయుద్ధం రాజుకుంది. సంతాల్‌ దివస్‌ కోసం తాను బెంగాల్‌కు వస్తే మమత పట్టించుకోలేదని, ప్రోటోకాల్‌ పాటించలేదని రాష్ట్రపతి ముర్ము విమర్శించడం సంచలనం రేపింది. ఎప్పుడు ప్రశాంతంగా, మౌనంగా ఉండే రాష్ట్రపతి ముర్ములో తొలిసారి బెంగాల్ సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తన సహజ శైలికి భిన్నంగా, బహిరంగంగానే దీదీపై విమర్శలు చేశారు. సిలిగురిలో నిర్వహించిన సంతాల్‌ దివస్‌లో పాల్గొన్న ముర్ము.. ఈ కార్యక్రమానికి మమత హాజరుకాకపోవడంపై ముర్ము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటనను సీఎం పట్టించుకోలేదని.. చెల్లెలు లాంటి మమత ఏదో బాధలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంతాల్‌ దివస్‌కు మమత సర్కార్‌ అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రోటోకాల్‌ను విస్మరించడం తగదంటూ పేర్కొన్నారు. తనకు స్వాగతం పలుకడానికి సీఎంతో సహా ఎవరు రాకపోవడం మంచి పద్దతి కాదన్నారు. బెంగాల్‌లో రాష్ట్రపతి ప్రోటోకాల్‌ వివాదంపై స్పందించారు ప్రధాని మోదీ, సహా పలువురు కీలక నేతలు స్పందించారు. బెంగాల్‌ సర్కార్‌ తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని ట్వీట్‌ చేశారు. ఆదివాసీలను మమత అవమానించారని మండిపడ్డారు. అయితే మోదీ వ్యాఖ్యలకు మమత కూడా కౌంటరిచ్చారు. రాష్ట్రపతి పేరుతో ఎన్నికల వేళ బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు ఇచ్చిన సలహాతో రాజకీయాలు చేయవద్దని రాష్ట్రపతి ముర్ముకు మమత విజ్ఞప్తి చేశారు.

కాగా.. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించారు. రాష్ట్రపతిని అవమానించడం తగదంటూ పేర్కొన్నారు. డార్జిలింగ్‌లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు జరిగిన అవమానంపై కేంద్ర బొగ్గు – గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ట్వీట్ చేసి.. పశ్చిమ బెంగాల్ లోని టీఎంసీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us