కార్ పార్కింగ్ గొడవ.. ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ను కాల్చి చంపిన పోలీసు..!

కారు పార్కింగ్‌ విషయంలో జరిగిన గొడవతో ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ని ఓ పోలీసు అధికారి కాల్చి చంపాడు. ఈ ఘటన పంజాబ్‌లోని కపుర్తాలా జిల్లాలో చోటు చేసుకుంది.

కార్ పార్కింగ్ గొడవ.. ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ను కాల్చి చంపిన పోలీసు..!
Follow us

| Edited By:

Updated on: May 09, 2020 | 5:06 PM

కారు పార్కింగ్‌ విషయంలో జరిగిన గొడవతో ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ని ఓ పోలీసు అధికారి కాల్చి చంపాడు. ఈ ఘటన పంజాబ్‌లోని కపుర్తాలా జిల్లాలో చోటు చేసుకుంది. మృతి చెందిన కబడ్డీ ప్లేయర్‌ని‌ అర్విందర్‌ జీత్‌ సింగ్‌గా గుర్తించిన పోలీసులు.. కాల్పులకు పాల్పడిన ఏఎస్సై పరమ్‌జీత్‌ సింగ్‌ని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ అర్విందర్‌ జీత్‌ సింగ్‌ గురువారం రాత్రి కారులో స్నేహితులతో కలిసి రైడింగ్‌కు వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు ఓ రోడ్డు పక్కన కారును పార్క్ చేసి అందులోనే కూర్చున్నాడు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఏఎస్సై పరంజీత్‌సింగ్‌.. ఇక్కడ ఎందుకు పార్కింగ్‌ చేశారు? అని అర్విందర్‌ను ప్రశ్నించారు. దీనికి అర్విందర్‌ సమాధానం చెప్పకుండా కారును స్టార్ట్‌ చేసి స్పీడ్‌గా వెళ్లాడు. దీంతో ఏఎస్సైకి అనుమానం రావడంతో.. ఆ కారును ఛేజింగ్‌ చేశారు. ఆ పోలీసు వదిలేలా లేడని భావించిన అర్విందర్.. ఓ చోట కారు ఆపి ఆయనకు వివరణ ఇచ్చేందుకు వెనక్కి తిరిగాడు. అంతలోనే తన వెహికిల్ నుంచి కిందకు దిగిన పరంజీత్‌ సింగ్… అర్విందర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో అర్వింద్‌ అక్కడికక్కడే మృతి చెందగా..  పక్కనే ఉన్న అతడి స్నేహితుడు ప్రదీప్‌ సింగ్‌కి గాయాలయ్యాయి. వెంటనే కారులో నుంచి దిగిన స్నేహితులు ఫైరింగ్ ఆపమని వేడుకోగా.. ఏఎస్సై ఆగాడు. ఆ తర్వాత అదే వెహికిల్‌‌లో అర్విందర్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. అతడు మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అర్విందర్‌ స్నేహితుల ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఏఎస్సైను అరెస్ట్ చేశారు.

Read This Story Also: నా భార్య పిల్లల్ని తీసుకొస్తే 10 లక్షలిస్తా.. ఎన్‌ఆర్‌ఐ నజరానా.. కండిషన్స్ అప్లై!