దేశంలోని వివిధ నగరాల్లో డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు సంబంధించిన వార్తలు అనేకం చూస్తుంటాం.. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా దేశంలోని వివిధ నగరాల్లో ప్రతిరోజూ వందలాది మంది చనిపోతున్నారు. అయితే జార్ఖండ్‌లో ర్యాష్ డ్రైవింగ్ వల్ల బైక్ రైడర్‌లు వారు ఊహించని విధంగా చాలా నష్టపోతారు. అయితే, తాజాగా ఒక బైక్‌రైడర్ చేసిన పనికి యువతి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్ లో చోటు చేసుకుంది. జంషెడ్‌పూర్‌లోని జూబ్లీ పార్క్ గేట్ ముందు ఒక మహిళ బహిరంగంగా హెల్మెట్‌తో బైక్ రైడర్‌ను కొడుతున్న దృశ్యాలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఆ మహిళ బైక్ రైడర్‌ను కొడుతున్న సీన్ చూసేందుకు జనాలు భారీగా గుమిగూడారు. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…
ఆర్తీదేవి అనే యువతి స్కూటీపై చిన్నారిని స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి బయల్దేరింది. ఇంతలో జూబ్లీ పార్కు సమీపంలో బైక్‌పై ట్రిపుల్ రైడ్‌తో వెళ్తున్న ఓ యువకుడు అతివేగంతో నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ వచ్చి ఆర్తీ దేవి స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న మహిళ, చిన్నారి రోడ్డుపై పడిపోయారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో వెనుక నుంచి పెద్దగా వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే, మహిళ, చిన్నారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది. బాధితులు రోడ్డుపై పడిపోయి ఉండగానే, బైక్‌పై వెళ్తున్న యువకుడు మహిళ స్కూటీని ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంతలో ధైర్యం ప్రదర్శించిన మహిళ బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఓవర్‌టేక్ చేసి పట్టుకుంది. నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ స్కూటీని ఢీకొట్టిన నిందితుడిని వీర కొట్టుడు కొట్టింది.
అయితే బైక్ నడుపుతున్న ముగ్గురు యువకుల్లో ఇద్దరు యువకులు అవకాశం దొరికిన వెంటనే పారిపోగా, ఓ యువకుడు మహిళ చేతికి చిక్కాడు. చొక్కా గళ్లా పట్టుకుని యువకుడిని బహిరంగంగానే చావచితక్కొట్టింది. చేతిలో హెల్మెట్ పట్టుకుని కుమ్మేసింది. దాంతో ఇదంతా చూసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. వెంటనే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు పెట్రోలింగ్ బృందం రావడంతో విషయం సద్దుమణిగింది. స్థానిక ప్రజలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం నిందితుడైన యువకుడిని పోలీసులు స్టేషన్ కు తరలించారు.
#Jharkhand#TrafficAlert
टक्कर मारकर भाग रहा था महिला ने कर दी सरेआम लात जूते और हेलमेट से पिटाई … pic.twitter.com/dzxPONyiow— Sweta Gupta (@swetaguptag) December 16, 2022
మహిళ ధైర్యాన్ని కొనియాడుతూనే.. ఇలాంటి మహిళలు తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పితేనే ఇలాంటి యువకుల తిక్క కుదురుతుందని స్థానికులు తెలిపారు. అదే సమయంలో సంఘటనా స్థలంలో ఉన్న కొంతమంది యువకులు ఏదైనా తప్పు చేసి ఉంటే, అప్పుడు వారిని బహిరంగంగా కొట్టే బదులు, మహిళ పోలీసులకు, పోలీసు స్టేషన్‌కు తెలియజేయాలని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి