
మీరు మా దప్పిక తీర్చకపోతే.. మేము మీ ఊపిరే తీసేస్తాం.. ఇక్కడ మా అణ్వస్త్రాలన్నీ డిస్‌ప్లే కోసం పెట్టుకోలేదు.. ఘోరీ, గజ్నవీ, షహీన్.. అన్ని మిసైల్స్ మీ వైపే గురిపెట్టి ఉన్నాయి..! పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ.. భారత్‌కు ఇలా అల్టిమేటమ్ ఇచ్చిన తర్వాతే.. అణుయుద్ధం ఇంటర్నేషనల్ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్‌ది పైపై పటారమేనా లేక విషయముండే మాట్లాడుతోందా? న్యూక్లియర్ వార్ అనివార్యమైతే ఎవరి ఖేల్ ఖతం అవుతుంది.. ప్రస్తుతం ఎవరి దగ్గర ఎన్నెన్ని వార్ హెడ్స్ ఉన్నాయి.. ఈ లెక్కలే ఇప్పుడు వరల్డ్‌వైడ్ ట్రెండింగ్‌లో ఉండేది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని యుద్ధంగానే భావిస్తాం.. అని స్వయానా పాకిస్తాన్ ప్రధానమంత్ర షహబాజ్ గేమ్ షురూ చేశారు. తర్వాత ఆ దేశ రక్షణ మంత్రి కూడా వంత పాడారు. ఇప్పుడు రైల్వే మంత్రి.. ఇలా వరసబెట్టి అందరూ ఒకే పాటకు అదేపనిగా కోరస్ ఇస్తుంటే.. అమెరికా కనీసం వారించనే లేదు. వాళ్ల ఆటేదో వాళ్లు ఆడుకోనివ్వండి.. ఇది వాళ్లకూ కొత్తకాదు మాకూ కొత్త కాదు అని సైడిచ్చుకున్నారు ప్రెసిడెంటు డోనాల్డ్ ట్రంప్. అటు చైనాదీ అదే వరస. అసలు భారత్ మీదకి పాకిస్తాన్‌ని ఎగదోసి పహల్గామ్ దాడికి సూత్రం కట్టిందే డ్రాగన్ కంట్రీ అని మన ఇంటిలిటెన్స్ అనుమానిస్తోంది. మీరేం చేసినాసరే మేం మీ వెనకే ఉంటామని పాకిస్తాన్‌కు ఓపెన్ సపోర్ట్ ఇచ్చింది చైనా. సో.. పాకిస్తాన్ అణ్వస్త్రాల లెక్క చెప్పేదాకా వచ్చిందంటే.....