దేశంలో అంతర్ జిల్లాలు, అంతర్ రాష్ట్ర రవాణాతో బాటు ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే శాఖ త్వరలో మరో 120 రైళ్లను నడపనుంది. ఇందుకు తమ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోను, హోమ్ మంత్రిత్వ శాఖతోను సంప్రదింపులు జరుపుతోందని ఈ శాఖ అధికారులు చెప్పారు. తొలి దశలో 100 రైళ్లను నడపనున్నారు. ఆ తరువాత మిగతా రైలు సర్వీసులను నిర్వహించనున్నామన్నారు. ప్రస్తుతం 230 స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు.
అయితే ఎప్పటికప్పుడు కోవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం ఈ సర్వీసులను నిర్వహిస్తామని, ప్రయాణికులకు అనుగుణంగా మార్గదర్శక సూత్రాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.